Viral Video : మహిళ చేతిలో జ్యూస్ చూసి మీదకెక్కి మరీ లాగించేసిన కోతి.. వీడియో వైరల్
ప్రధానాంశాలు:
Viral Video : మహిళ చేతిలో జ్యూస్ చూసి మీదకెక్కి మరీ లాగించేసిన కోతి.. వీడియో వైరల్
Viral Video : ఈ రోజుల్లో కోతుల బెడద ఎక్కువ అయింది. పట్టణాలలో కూడా కోతులు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. కోతుల ప్రత్యేకత ఏమిటంటే వాటికి కూడా మనుషుల మాదిరిగానే బొటనవేలు ఉంటుంది. బొటనవేలు సహాయంతో అవి మానవులు ఎలా చేయగలరో అదే విధంగా వాటిని పట్టుకోగలవు. ఈ బొటనవేలు రావడంతో మానవ పూర్వీకులు ఉపకరణాలను తయారు చేయడం ప్రారంభించారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ బొటనవేలు సహాయంతో, కోతులు సులభంగా చెట్లను ఎక్కగలవు.ఒక్క కోతి వనం వీడి.. జనంలోకి వస్తేనే దాని చేష్టలకు .. జనం పడే పాట్లుకు అంతే ఉండదు. మరి అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా భర్తీ సంఖ్యలో కోతులు వనం వీడితే.. జనంలోకి వస్తే అప్పుడు అక్కడ ఏర్పడే పరిస్థితుల గురించి ఎంత చెప్పినా తక్కువే..
Viral Video కోతి భలే చేసిందిగా..
ఇటీవల పల్లెలు, పట్టణాలలో కూడా కోతుల బెడద ఎక్కువైంది. కాయలు, పండ్లే కాదు, మనుషుల్లాగే వెరైటీ తిండి తింటున్నాయి. గ్రామస్థులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. అవును గడిచిన దశాబ్దం నుంచి కోతుల జనాభా అంతకంతా పెరుగుతుంది. కోతుల సంఖ్య ఎంతగా పెరిగిందంటే అవి మనుషుల మధ్య దర్జాగా బతుకుతున్నాయి.ఇళ్లల్లోకి , రోడ్డు పై వెళ్తున్న వారిని కరుస్తూ స్థానికులను ఇబ్బంది పెడుతున్న కోతుల్ని వెంటనే పట్టుకొని అడవుల్లో వదలాలన్నది కొందరి డిమాండ్. ఇంటిలో ఉన్న మహిళపై ఒక్కసారిగా కోతులు చొరబడి గాయపరచడం మనం చూస్తూ ఉన్నాం.
అయితే ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఇది చూసిన వారు ఔరా అంటున్నారు. ఓ మహిళ చేతిలో జ్యూస్, మరో చేతిలో హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని స్టైలిష్‌గా వస్తుంది. అయితే అంతలోనే ఓ కోతి మహిళ చేతిలో జ్యూస్ చూసింది.ఇంకేముంది వెంటనే మెల్లిగా ఆమె మీదకు వెక్కి చేతిలో ఉన్న జ్యూస్‌ని చక్కగా లాగించేసింది. ఇక ఆ మహిళ ఏ మాత్రం భయపడకుండా ఆ దృశ్యాలని తన మొబైల్‌లో రికార్డ్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, చూసిన వారంతా కూడా ఆశ్చర్యపోతున్నారు.
Monkey steals woman’s drink 🐒😂 pic.twitter.com/j12mASnJZF
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 26, 2024