Viral Video : రామచిలుక కొంటెగా చేసిన పనికి.. భయపడి బల్ల కిందికి పారిపోయిన పిల్లి..
Viral Video : సోషల్ మీడియాలో తరచూ ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. సదరు వీడియోలను చూసి నెటిజన్లు తెగ సంతోషపడిపోతుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రజెంట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. సదరు వీడియోలో రామ చిలుక చేసిన కొంటె పనిని చూస్తే కనుక మీరు నవ్వకుండా ఉండలేరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంతకీ సదరు వీడియోలో రామ చిలుక ఏం చేసిందంటే..
గుల్దుర్ బకలిం అనే ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియా వేదకగా షేర్ చేసిన ఈ వీడియోలో రామ చిలుక కొంటె పని చేసింది. ‘నాటీ ప్యారట్’ అనే క్యాప్షన్‌తో షేర్ కాబడిన వీడియో చూసి నెటిజన్లు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. వీడియోలో అలా సరాదాగా ఓ వ్యక్తి వద్దకు పిల్లి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన రామ చిలుక.. పిల్లి తోకను పట్టి గుంజింది. దాంతో పిల్లి భయపడిపోయి ‘మియావ్..’ అని అరిచేసింది. పిల్లి.. అలా మియావ్ అరవగానే వీడియోలో ఉన్న వ్యక్తి రామ చిలుక అటు వైపుగా రావడాన్ని నివారించింది.

naughty parrot in Cat video viral
Viral Video : పిల్లి తోక గుంజిన రామచిలుక.. హడలిపోయిన క్యాట్..
ఇకపోతే రామ చిలుక చేసిన పనికి పిల్లి భయపడిపోయింది. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న బల్ల కిందకు వెళ్లిపోయింది పిల్లి. పక్షులకు సంబంధించిన గ్రేట్ వీడియోస్ ఇటువంటివి ట్విట్టర్ వేదికగా చాలా వైరలవుతుంటాయి కూడా. ఈ వీడియోను చూసి నెటిజన్లు రామ చిలుక ఇలా కొంటె పనులు కూడా చేస్తుందా అని అడుగుతున్నారు.
naughty parrot ????????????♥️ pic.twitter.com/mcsuZXuRVv
— güldür güldür (@guldurbakalim) January 10, 2022