Viral Video : క్లాస్ రూమ్ లో టీచర్ స్టెప్పులు.. స్టూడెంట్స్ తో కలిసి డ్యాన్స్
Viral Video : సాధారణంగా టీచర్ అనగానే స్టూడెంట్స్ భయపడుతుంటారు. బాధ్యత గుర్తు చేసుకుంటారు. హోం వర్క్ చేశామా లేదా అని చెక్ చేసుకుంటారు. టీచర్ అంటే క్లాస్ రూమ్ లో పాఠాలు చెబుతారు.. ఎగ్జామ్స్ పెడతారు.. క్రమశిక్షణ నేర్పుతుంటారు.. పిల్లలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రభావితం చేస్తారు. ఎన్నో విద్యాబుద్దులు నేర్పుతుంటారు. చదవకపోతే దండిస్తారు. చదివితే ఎంకరేజ్ చేస్తారు. ఒకరకంగా పేరెంట్స్ తర్వాత అన్ని రకాలుగా స్టూడెంట్స్ ని తయారు చేస్తారు. టీచర్స్ చెప్పినట్లు విని ఎంతో మంది గొప్ప స్థాయిలో ఉన్నారు. అందుకే గురువును మించిన దైవం లేదు అంటారు పెద్దలు..
ఆచార్యదేవోభవ అంటూ విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గౌరవిస్తాం. మన తెలివితేటలు, ఆలోచనల గురించి వారికి పూర్తిగా తెలుసు. మనకు ఈ సబ్జెక్టుపై మంచి పట్టుంది… ఏ కోర్సు చేస్తే భవిష్యత్తు బాగుంటుందో సూచిస్తుంటారు. ప్రతి స్టూడెంట్ ని మంచి దారిలో నడిపించే విషయంలో ముందుంటారు. చదువు మీద శ్రద్ధ చూపకపోతే.. చెడు దారులను ఎంచుకున్నా భిష్యత్తుపై వివరించి మన ఎదుగుదలను కోరుకుంటారు. దండించైనా సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తారు.
అందుకే గురువును మించిన దైవం లేదని అంటూ ఉంటారు. మనల్ని అత్యున్నత స్థానంలో చూడాలని ప్రతి ఉపాధ్యాయుడు కోరుకుంటారు.ఎంతో మంది టీచర్స్ చదువు గురించి మాత్రమే కాదు .. అటలు పాటలు నేర్పుతూ సరదాగా ఉంటారు. స్టూడెంట్స్ తో కలిసి ఆడిపాడతారు. అయితే ప్రస్తుతం ఓ టీచర్ స్టూడెంట్ తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. క్లాస్ రూమ్ లో స్టూడెంటె డ్యాన్స్ చేస్తుండగా పక్కనే ఉన్న టీచర్ ఆ స్టూడెంట్ తో కలిసి స్టెప్పులేసి ఆకట్టుకుంది.