Viral Video : ఆగి ఉన్న రైలులో దొంగతనం .. చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్న దొంగ .. వైరల్ వీడియో!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : ఆగి ఉన్న రైలులో దొంగతనం .. చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్న దొంగ .. వైరల్ వీడియో!!

 Authored By aruna | The Telugu News | Updated on :5 September 2023,7:00 am

Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ప్రపంచం మొత్తం మన చేతిలోనే ఉంది. స్మార్ట్ ఫోన్ల కారణంగా ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు జనాలను అలరిస్తూ ఉంటాయి. అందులో కొన్ని వీడియోలు ఆశ్చర్యంగా ఉంటాయి మరి కొన్ని వీడియోలు నవ్వింప చేసేలా ఉంటాయి. అలాగే ఇంకొన్ని వీడియోలు షాకింగ్ గా అనిపిస్తాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో లో ఓ దొంగ ఆగి ఉన్న రైలులోకి దొంగతనం చేయడానికి వచ్చాడు కానీ చివరికి ప్రాణాలు మీదికే తెచ్చుకున్నాడు.

ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. బీహార్ లోని బెసుగాయ్ ప్రాంతంలో ఆగి ఉన్న రైలులోకి దొంగతనం చేయడానికి వచ్చి దొంగతనం చేస్తుండగా ఒక ప్రయాణికుడు దొంగ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ముందుగా ఆ దొంగ ఆగి ఉన్న రైలు లో ఉన్న ప్రయాణికులను బయట ఉండి పరిశీలించాడు. కాసేపట్లో రైలు కదలపోతుంది అనగా ఆ దొంగ రైలు కిటికీలోంచి దొంగతనం చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఓ ప్రయాణికుడు దొంగ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలో రైలు కదలడంతో రైలు కింద పడిపోకుండా ప్రయాణికులు అతడిని పట్టుకుని కాపాడే ప్రయత్నం చేశారు.

The thief theft in the stopped train viral video

The thief theft in the stopped train viral video

తర్వాతి స్టేషన్లో రైలు ఆగగానే అతడిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు అప్పగించారు. ఇలా ఆ దొంగ చోరీ చేస్తూ ప్రయాణికుల చేత పట్టుబడ్డాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దొంగతనం చేస్తూ ఆ దొంగ ఇలా పట్టుబడడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్ లు చేశారు. అతడి అదృష్టం బాగుంది రైలు కింద పడలేదు లేకపోతే అతడి ప్రాణాల మీదికి వచ్చేది అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది