Viral Video : ఇదెక్కడి పెళ్లిరా మావా.. వర్షంలో తడుస్తూ మరీ తాళి కట్టిన వరుడు
Viral Video : ఒక్కోసారి పలు కారణాలతో చాలా పెళ్లిలు ఆగిపోతుంటాయి. మండపంలో కూర్చున్న తర్వాత కూడా పెళ్లీలు ఆగిపోవడం చూస్తుంటాం. అప్పటివరకు చేసుకున్న ఏర్పాట్లు అన్నీ వృథా అయిపోతాయి. అయితే వరకట్నం విషయంలోనో.. లేక ఎవరైనా సడెన్ గా కావాల్సిన వారు చనిపోతేనో.. లేదా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తీరా ఇష్టం లేదని చేప్తేనో ఆగిపోతుంటాయి. అలాగే పెళ్లుకూతరు లేదా వరుడు జంప్ అవుతే కూడా పెళ్లి ఆగిపోతుంది. దీంతో ఎంతో నష్టం కలుగుతుంది. బంధాలు పోతాయి… ఎన్నో గొడవలు జరుగుతాయి.
అప్పటి వరకు చేసుకున్న ఏర్పాట్లు మండపం.. వస్త్రాలు.. షామియానాలు.. పెళ్లి సరుకులు.. ఇలా ఒక్కటేమిటీ అన్నీ వృథా అవుతాయి. అయితే కొంతమంది బలంగా అనుకుంటే వానొచ్చినా వరదొచ్చినా మా పెళ్లి ఆపలేవు అంటుంటారు సరదాగా. అయితే ఇక్కడ ఓ పెళ్లి నిజంగానే వానొచ్చినా.. అందులో వరద ఒచ్చినా పెళ్లి మాత్రం ఆపలేరు. అది ఎక్కడో చూద్దాం..పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయితే.. రాసి పెట్టి ఉంటే ఎవ్వరూ ఆపలేరు. అని నిరూపించింది ఓ జంట. పెళ్లి సమయానికి విపరీతమైన వర్షం అందులో మండపంలోకి వరద.. ఎంతలా అంటే మండపంలో వర్షపు నీటిని ఎత్తిపోస్తున్నారు

varudu Bride wedding day a Rain Video Viral
అంటేనే సీన్ అర్థం చేసుకోవచ్చు. బీకరమైన వర్షం.. మండపంలో వరద ఇవేవి కూడా ఈ పెళ్లిని ఆపలేకపోయాయి. వర్షం నీటిలోనే వధూవరులు కూర్చున్నారు. ఓ పక్క మండపంలో వరద నీటిని ఎత్తిపోస్తున్నారు. నీటిలోనే కెమెరా మెన్ కూర్చుని పెళ్లిని కవర్ చేస్తున్నాడు. బంధువులు ఆ పక్కనే నిల్చుని పెళ్లి పనులు చేస్తున్నారు. ఇక పెళ్లి లో సామాన్లు అన్నీ తడిచిముద్దయ్యాయి. ఇంత జరుగుతున్నా పెళ్లి కొడుకు మాత్రం గ్లాసెస్ మెయింటైన్ చేస్తున్నాడు. పెళ్లి మాత్రం వాయిదా వేయకుండా చేసుకున్నారు.
View this post on Instagram