Viral News : తల్లికి 104 వ పుట్టిన రోజును జరిపిన 90 ఏళ్ల కొడుకు.. వీడియో !
ప్రధానాంశాలు:
Viral News : తల్లికి 104 వ పుట్టిన రోజును జరిపిన 90 ఏళ్ల కొడుకు.. వీడియో !
Viral News : అసలు మనిషి ఆయుష్షు 120 సంవత్సరాలు. మన తాత, ముత్తాతలు 100 సం.రాలు పైబడి బ్రతికారు. ఎందుకంటే వాళ్ల శారీరక శ్రమ అలాంటిది, టెన్షన్ లేని జీవితం. మరి అలా ఇప్పటి వాళ్ళు బ్రతకగలరా అంటే ఆలోచించాల్సిన విషయమే. చాలా మంది 30 , 40 సంవత్సరాలకి హార్ట్ ఎటాక్ వివిధ రకాల అనారోగ్య సమస్యలతో మరణిస్తున్నారు. ప్రస్తుతం జీవనశైలి పూర్తిగా మారింది. ప్రతి దాంట్లో కలుషితం. చిన్నపిల్లలు తాగే పాల దగ్గర నుంచి ప్రతీది కలుషితమే. ఇలాంటి తరుణంలో ఓ వృద్ధురాలు 104 వ పుట్టినరోజును జరుపుకున్నారు. తన 90 ఏళ్ల కొడుకు తల్లి 104 పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. మండా గున్న రాజమ్మ అనే వృద్ధురాలు 1920లో జన్మించారు.
90 ఏళ్ల కొడుకు తన తల్లి గురించి చెబుతూ తన తల్లి థర్డ్ ఫారం చదివారని, కుట్లు, అల్లికలు వచ్చని, తన మూడవ ఏటనే తన తండ్రి మరణించారని, అప్పటినుంచి తమని అమ్మమ్మ తాతయ్య పెంచారని చెప్పుకొచ్చారు. ఇక ఆమె కూరగాయలు మాత్రమే తింటారని, మాంసాహారం అసలు తినరని చెప్పారు. బీపీ షుగర్ లాంటి అనారోగ్య సమస్యలు అసలు లేవని, జలుబు జ్వరం లాంటి వస్తూ ఉంటాయి తప్ప మరెలాంటి దీర్ఘకాలిక వ్యాధులు లేవని తెలిపారు. బయటి ఆహారం అసలు తీసుకోరని తన పని తాను చేసుకుంటారని కేవలం ఇంట్లోని ఆహారం మాత్రమే తీసుకుంటారని, ఖాళీగా అసలు ఉండరని ఏదో ఒకటి సర్దుతూ ఉంటారని చెప్పారు.
బయటి ఆహారం అసలు తినరని కేవలం ఇంట్లో చేసినవి మాత్రమే తింటారని అది కూడా మితంగానే తీసుకుంటారని కడుపునిండా తినరని చెప్పుకొచ్చారు. అయితే ఆమె ఆరోగ్య రహస్యం ఇదే అయి ఉంటుందని అంటున్నారు. ఇక చాలామంది పరిమితికి మించి ఆహారాన్ని తీసుకుంటారు. దానివల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఏ ఆహారమైన మితంగానే తీసుకోవాలి. పరిమితికి మించి తింటే అది అనర్ధాలకు దారితీస్తుంది. ప్రస్తుత కాలంలో భోజనం ప్రియులు ఎక్కువయ్యారు. ప్రతిదీ ఆరోగ్యకరంగా కంటే రుచిగా చేసుకొని పరిమితికి మంచి ఆహారాలు తీసుకుంటున్నారు. దీనివలన వారు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు 30, 40 సంవత్సరాలకి హార్ట్ ఎటాక్ లాంటి వాటితో మృతి చెందుతున్నారు.