Viral Video : ఇదేందిది.. ఇంత చిన్న గ్యాప్ నుంచి ఎలా దూరిదబ్బ..
Viral Video : పెంపుడు జంతువుల్లో పిల్లి కూడా ఒకటి. పిల్లులు, కుక్కలు మనకు తోడుగా ఉంటూ ఎంతో సహాయం చేస్తాయి. ఇవి చాలా సులభంగా మనం చెప్పిన వాటిని నేర్చుకుంటాయి. ఇవి మియాం మొదలైన వివిధ శబ్దాలతో ఇతర పిల్లులతో సంభాషిస్తాయి కూడా. ఎంతో మంది పిల్లులను ఇష్టంగా పెంచుకుంటారు. దాంతో ఇష్టంగా ఆడుకుంటూ ఫన్ క్రియేట్ చేస్తారు. అప్పుడప్పుడు వాటికి రకరకాల గేమ్స్ పెడుతూ ఆటపట్టిస్తుంటారు.
పిల్లులను మనం ప్రతి రోజు చూస్తూనే ఉంటాం. గోడ పైన నుంచి అటూ ఇటూ దూకుతూ ఉంటాయి. ఎంత చిన్న గ్యాప్ నుంచైనా దూరడానికి ప్రయత్నిస్తుంటాయి. చిన్న వస్తులపై నుంచి గోడలపై నుంచి దూకుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంటాయి. ఆ జంతువులను, పక్షులను చూస్తుంటే ఒక్కోసారి మనకే ఆశ్చర్యమేస్తుంది. వాటి సహసాలు, చేష్టలు భలేగా ఉంటాయి. ప్రస్తుతం కూడా ఓ పిల్లికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

Viral Video in cat came out of gap very simply
Viral Video : ఎలాగైనా దూరేస్తా..
ఈ వీడియోలో 35 సెం.మి గ్యాప్ నుంచి పిల్లి చాలా సింపుల్ గా బయటకు వచ్చేసింది. అయితే ఈ గ్యాప్ ని ఎంత తగ్గించినా ఆ పిల్లి ఎలాగోలా బయటపడుతుంది. చివరగా 7 సెం.మి గ్యాప్ నుంచి అతిబలవంతంగా దూరింది. 6 వ సెం.మి నుంచి దూరలేక పైనుంచి దూకింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. పిల్లి తెలివితేటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫన్నీ కామెంట్స్ చేస్తు లైకులు కొడుతున్నారు.
Perfecto! ????????????????pic.twitter.com/QSDMojUDFe
— Figen (@TheFigen) March 26, 2022