Viral Video : ఈ డాగ్ వాటర్ తాగడానికి పడే కష్టాలు చూస్తే నవ్వాగదు..
Viral Video : నెట్టింట వైరల్ వీడియోలకు కొదవే ఉండదు. ఓ స్మార్ట్ ఫోన్, దానికి ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలు. నెటిజన్లు తమ కళా పోషనను చూపిస్తుంటారు. ఫ్రాంక్ వీడియోలతో భయపెట్టిస్తుంటారు. ఫన్నీ వీడియోలతో ఆకట్టుకుంటారు. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేస్తుంటుంటారు. నెట్టింట వైరల్ అయ్యే వీడియోలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఇంత సిల్లీ వీడియో వైరల్ ఎందుకు అవుతోందబ్బా..? అని అంతా ఆశ్చర్యపడిపోతుంటారు.
సోషల్ మీడియాలో మనుషుల రిస్కీ ఫీట్లు, నెటిజన్ల టాలెంట్లకు సంబంధించిన వీడియోలతోపాటు జంతువుల వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి.పెంపుడు జంతువులతో చేసే ఫన్నీ చేష్టలు నవ్వు తెప్పిస్తుంటాయి. పిల్లులు, కుక్కలతో వారు ఆడే ఆటలకు సంబంధించిన వీడియోలయితే నెట్టింట ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కుక్క వాటర్ తాగడానికి ప్రయత్పిస్తుండగా ఫన్ క్రియేట్ అవుతోంది.
Viral Video : పాపం డాగ్..
ఒక స్టాండ్ కు బిగించిన వాటర్ పైప్ ద్వారా వాటర్ తాగడానికి ఆ స్టాండ్ బటన్ ను నొక్కి పడితే వాటర్ వస్తాయి. అయితే ఈ డాగ్ వాటర్ తాగడానికి స్టాండ్ తొక్కి వాటర్ తాగడానికి ట్రై చేస్తోంది. కానీ.. స్టాండ్ ని నొక్కి పట్టకుండా కేవలం ఒకసారి నొక్కి వాటర్ కనపడగానే తాగడానికి ట్రై చేస్తుంది. స్టాండ్ నొక్కి పట్టి లేకపోవడంతో వాటర్ ఆగిపోతున్నయ్. దీంతో మళ్లీ రిపిటెడ్ గా తొక్కి వాటర్ వైపు చూస్తోంది.. ఆ వీడియోను చూసి నెటిజన్లు ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఫన్ని కామెంట్స్ చేస్తూ తెగ నవ్వుకుంటున్నారు.