Viral Video : ఫుట్‌పాత్‌పై ఉన్న కుటుంబం ఆకలి తీర్చిన పోలీసులు.. సూపర్ అంటున్న నెటిజన్లు
Viral Video : ఆపదలో ఉన్నప్పుడు ఎదుటి మనిషికి సాయం చేస్తేనే మనలోని మంచితనం బయటపడుతుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే మనిషిలో మానవత్వం కరువైపోతుంది. సొంతవాళ్లకు ఆపద వచ్చినా పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు. అయితే మనలో చాలామందికి పోలీసులు అంటే మంచి అభిప్రాయం ఉండదు. వాళ్లు అనవసరంగా కేసులు పెట్టి హింసకు గురిచేస్తారని అందరూ అంటుంటారు.అయితే అందరూ పోలీసులు ఒకలా ఉండకపోవచ్చు.
పోలీసుల్లో కొందరు మంచివాళ్లు కూడా ఉంటారు. వాళ్లు ఎదుటివారికి సహాయం చేస్తూ తమలోని మానవత్వాన్ని బయటకు తీస్తుంటారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని ఓ పోలీస్ కూడా మంచితనం చాటుకున్నాడు. బోరబండలోని బస్టాప్ వద్ద ఓ మహిళ ఆకలితో అలమటిస్తుండటాన్ని చూసి చలించిపోయాడు.వివరాల్లోకి వెళ్తే.. ఎస్.ఆర్.నగర్ పెట్రోలింగ్ స్టాఫ్ రాత్రి పూట బోరబండలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బస్టాప్ వద్ద ఓ అడుక్కునే మహిళ ఆకలితో బాధపడుతోంది.
Viral Video : ఎస్.ఆర్.నగర్ లో..
తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతోంది. ఆమెను చూసిన ఓ పోలీస్ చలించిపోయాడు. దీంతో ఆమెకు కడుపునిండా అన్నంపెట్టాడు. కర్రీ, పెరుగు కూడా అందించాడు.ఓ స్థానికుడు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్‌లు పోలీస్ చేసిన పనిని ప్రశంసిస్తున్నారు. కాగా ఇటీవల పోలీసులు పలు సందర్భాల్లో మంచితనం చాటుకుంటున్నారు. వరదలు, ఆపదలు వచ్చినప్పుడు వారిలోని మంచితనం బయటపడుతుంది. అందుకే పోలీసులను తప్పుగా అంచనా వేయకండి.
Food distribution to hunger beggar family at borabanda bus stop by SR Nagar patrol staff. pic.twitter.com/9ws7o0s2fa
— SHO SR NAGAR (@shosrnagar) April 25, 2022