Viral Video : కుక్క పిల్లల్ని ముద్దు చేస్తోన్న సింహం.. ఎలాంటి జంకు లేకుండా ఆడుకుంటున్న డాగ్స్
Viral Video : సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. జంతువులు.. పక్షులకు సంబంధించిన వీడియోల గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరుత పులుల వేటలు.. కోతుల అల్లరి ఆటలు.. ఇలా ఒక్కటేమిటీ అనేక వీడియోస్ చక్కర్లు కొడుతుంటాయి. కుక్క పిల్లల వీడియోస్ కూడా అధికంగా ఉంటాయి. సాధారణంగా కుక్కపిల్లలను చాలా మంది ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. ఇంట్లోని సభ్యులమాదిరిగానే ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అవి కూడా అలాగే ప్రవర్తిస్తుంటాయి.
సాధారణంగా సింహాన్ని దూరం నుంచి చూస్తేనే భయం వేస్తుంది. అది బోనులో ఉన్నా దగ్గరకి వెళ్లటానికి భయపడుతుంటాం. సింహం జంతువుల రారాజుగా పిలుచుకుంటాం.. అది ఎలాంటి జంతువునైనా మట్టికరిపించగలదు. సింహాన్ని చూస్తేనే చాలా జంతువులు అటు నుంచి అటే పారిపోతుంటాయి. ఎంత పెద్ద జంతువులైనా భయపడాల్సిందే దానికి.. అలాంటిది రెండు కుక్క పిల్లలు ఏకంగా ఆడుకుంటున్నాయి. ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Viral Video lion dogs in playing
ఓ పార్క్ లో సింహం కూర్చోని ఉండగా రెండు చిన్న కుక్క పిల్లలు దానికి దగ్గరకు వెళ్లి దానితో ఆడుకుంటున్నాయి. సింహం కూడా వాటిని ఏం అనకుండా ముద్దు చేస్తోంది. కాళ్లతో నిమురుతూ ఆడుతోంది. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఎలాంటి జంతు వైరం లేకుండా ఎంత బాగా ఆడుకుంటున్నాయో అంటూ నెటిజన్లు సంబరపడుతున్నారు. లైకులు కొడుతూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. లేటెందుకు మీరు కూడా చూసి ఆనందించండి మరి..
The dogs are seeing off the lion before he’s off to work pic.twitter.com/mJuhgpLIAl
— Morissa Schwartz ???? (Dr. Rissy) (@MorissaSchwartz) April 1, 2022