Viral Video : ఈమెది మాములు అదృష్టం కాదు.. మేడపై నుండి పడ్డ వాటర్ ట్యాంక్.. అయినా కూడా..!
ప్రధానాంశాలు:
Viral Video : ఈమెది మాములు అదృష్టం కాదు.. మేడపై నుండి పడ్డ వాటర్ ట్యాంక్.. అయినా కూడా..!
Viral Video : సాధారణంగా మనకు మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఊహించటం ఎవరితరం కాదు. అప్పటి వరకు సరదాగా గడిపిన వారు కూడా ఉన్నట్లుండి కూప్పకూలుతున్న ఘటనలు ఇటీవల కాలంలో చాలానే చూస్తున్నాం. కారణాలు ఏవైనా అకాల మృత్యువులతో అనేక కుటుంబాల్లో విషాదం అలుముకుంటుంది. కొన్నిసార్లు మనల్ని అదృష్టం కూడా వెంటాడుతుంది. తాజాగా జరిగిన సంఘటన చూస్తే ఆమె ఎంత అదృష్టం చేసుకున్నదో మనకి ఇట్టే అర్ధమవుతుంది. ఓ మహిళ రోడ్డుపై వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి పైనుంచి ఓ పెద్ద ట్యాంక్ మీద పడడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..
Viral Video ఏమన్నా అదృష్టమా..
ఓ మహిళ కాలనీలోని ఇంటి ముందు నిలబడి ఉంటుంది. సదరు ఇంటి యజమానులతో మాట్లాడిన ఆమె.. తర్వాత తన ఇంటికి వెళ్తుంటుంది. ఇలా రెండు, మూడు అడుగులు వేసేలోగానే షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. పైనుంచి ప్లాస్టిక్ నీళ్ల ట్యాంక్ మీద పడింది. అయితే ట్యాంక్ మధ్యలో ఆమె ఉండడంతో కింద ఉన్న రంధ్రంలో ఇరుక్కుపోయింది. కాసేపటికి ట్యాంక్ లోపలి నుంచి తల బయటికి పెట్టి పైకి చూసింది. ఇంతలో ఆమె కుటుంబ సభ్యులు, అక్కడే ఉన్న కొంతమంది పరుగెత్తుకుంటూ వచ్చారు. బిల్డింగ్‌పై ట్యాంక్ పనులు చేసేవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి చూస్తుంటే ఆ భవనంపై ట్యాంక్ పనులు చేస్తుండగా.. ప్రమాద వశాత్తు నీళ్ల ట్యాంక్ ఆమెపై పడినట్లు తెలుస్తోంది. అయితే సరిగ్గా ఆమె ట్యాంక్ మధ్యలో నిలబడడంతో ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె టైం ఎంతో బాగుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇంత ప్రమాదం జరిగినా ఆమె తినడం మాత్రం ఆపలేదు కదా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 83 వేలకు పైగా లైక్‌లు, 3.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
అదృష్టం అంటే ఆమెదే.. తృటిలో తప్పిన ప్రాణాపాయం..
యాపిల్ తింటూ రోడ్డుపైకి వచ్చిన మహిళ.. ఒక్కసారిగా మేడ మీద నుంచి మహిళపై పడ్డ వాటర్ ట్యాంక్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ మహిళ. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో pic.twitter.com/UR9kvOk1gI
— ChotaNews (@ChotaNewsTelugu) October 14, 2024