Viral Video : వింత శిశువు.. రెండు ముఖాలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో జన్మించి ఆపై..!
ప్రధానాంశాలు:
Viral Video : వింత శిశువు.. రెండు ముఖాలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో జన్మించి ఆపై..!
Viral Video ఇటీవల మనం కొన్ని వింతలు చూస్తున్నాం. రెండు తలకాయలు, రెండు నాలుకలు ఇలా పలు రకాల వింతలతో అనేక జీవులు జన్మించడం మనం గమనిస్తూ ఉన్నాం.తాజాగా ఓ పసిబిడ్డ నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించాడు. యూపీలోని సీతాపూర్ పరిధిలోని రేవణ్ సందా అనే గ్రామంలో ఈ వింత చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రాథమిక వైద్యశాలలో పూనమ్ అనే మహిళ ఈ వింత శిశువుకు జన్మనిచ్చింది. నాలుగు కాళ్లు, నాలుగు చేతులు, రెండు ముఖాలు ఉన్నాయి. వింతగా పుట్టిన ఆ శిశువును చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Viral Video జన్యు లోపం..
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కిరాతాపూర్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల రమాదేవి నిండు గర్భిణి. ఆదివారం అర్ధరాత్రి ఆమెకు ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో రేవన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. , సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు అసాధారణ శిశువుకు రమాదేవి జన్మనిచ్చింది. ఆ బాబుకు రెండు ముఖాలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. వింతగా పుట్టిన ఆ శిశువును చూసి వైద్యులు, నర్సులు షాక్ అయ్యారు. అయితే ఆ శిశువు శరీరం మరో శిశువు శరీరానికి అతుక్కుపోయిందని డాక్టర్లు తెలిపారు. ఒక శరీరం అభివృద్ధి చెందగా మరో శరీరం అభివృద్ధి చెందలేదని చెప్పారు. దీంతో ఆ బాబుకు రెండు ముఖాలు, నాలుగు కాళ్ళు, నాలుగు చేతులు ఉన్నాయని అన్నారు.
నాలుగు కాళ్లు, చేతులతో జన్మించిన శిశువును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హాస్పిటల్ కు బారులు తీరారు. బాలుడిని చూసిన జనాలు అతడు దైవాంశ సంభూతమని కొందరంటుంటే.. జన్యు లోపం వల్ల ఇలా జరిగి ఉంటుందని మరికొందరు అంటున్నారు. జన్యు లోపం వల్ల తరచూ ఇలాంటి శిశువులు జన్మించడం జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. అయితే పుట్టిన ఐదు గంటల తర్వాత ఆ పసి బాబు మరణించాడు. దీంతో శిశువు తల్లిదండ్రులు ఆవేదన చెందారు. కాగా, వింత శిశువు వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
सीतापुर – रेवान सांडा पीएचसी में अद्भुत बालक का जन्म
➡बालक के चार पैर, चार हाथ बना चर्चा का विषय
➡बालक का समूर्ण दूसरा शरीर एक में ही जुड़ा हुआ
➡बच्चे को देखने के लिए उमड़ रही सैकड़ों की भीड़#Sitapur | #BreakingNews | #BharatSamachar pic.twitter.com/dvnjc6G8Ch— भारत समाचार | Bharat Samachar (@bstvlive) July 22, 2024