Viral Video : ఈ కప్ప చిన్నది కాదు.. అంత పెద్ద పిల్లినే ఎలా బెదిరించిందో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు
Viral Video : సాధారణంగా కప్పలు అంతగా భయపెట్టే జంతువులు కాదు. కప్పల్లోనూ రకాలు ఉంటాయండోయ్. కొన్ని కంప్పలు బావుల్లో చెరువుల్లో ఉంటాయి. మరికొన్ని కప్పులు.. ఇళ్ల బయట.. పేరట్లో కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఎగిరే కప్పలు కూడా ఉంటాయి. ముఖ్యంగా బావుల్లో ఉండే కప్పలు కూడా అలాగే ఎగురుతూ ఉంటాయి. కొన్ని కప్పలు నిదానంగా ఉంటాయి.చైనాలో కప్పలను కూడా వదలరు. వాటిని కూడా తినేస్తారు. అయితే.. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులోఓ కప్ప.. ఓ పిల్లి రెండింటి మధ్య జరిగిన పోరుకు సంబంధించిన వీడియో అంది.

war between frog and cat while eating food video viral
నిజానికి.. పిల్లి కింద కప్ప ఎంత. కప్ప చాలా చిన్న జీవి. కానీ.. పిల్లి దాని కంటే పెద్దగానే ఉంటుంది. కానీ.. ఓ పిల్లి.. కప్పను చూసి భయపడిపోయింది. ప్లేట్ లో ఉన్న ఫుడ్ ను పిల్లి తింటుండగా అక్కడికి ఓ కప్ప వచ్చింది. ఇక నువ్వు తిన్నది చాలు.. ఇక్కడి నుంచి వెళ్లిపో. అది నా ఫుడ్ అన్నట్టుగా పిల్లిని బెదిరించింది కప్ప.
Viral Video : అంత పెద్ద పిల్లిని.. చిన్న కప్ప గడగడలాడించింది
కప్ప బెదిరింపులకు పిల్లి కూడా భయపడిపోయింది. వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. దీంతో ఆ ప్లేట్ లో ఉన్న ఫుడ్ ను కప్ప ఏం చక్కా ఆరగించేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి వామ్మో.. కప్ప మామూల్ది కాదు.. పిల్లిని ఎలా గడగడలాడించింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Just when you think you’ve seen everything ???? pic.twitter.com/l18rhVUWLa
— CCTV_IDIOTS (@cctv_idiots) February 25, 2022