Women : నదిలో స్నానం చేస్తూ మహిళ చేసిన నిర్వాకం చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు .. వైరల్ వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Women : నదిలో స్నానం చేస్తూ మహిళ చేసిన నిర్వాకం చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు .. వైరల్ వీడియో

 Authored By aruna | The Telugu News | Updated on :12 October 2023,1:00 pm

Women : ప్రస్తుతం సోషల్ మీడియాకు ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాస్త ఖాళీ సమయం దొరికిన సోషల్ మీడియాలో మునిగి తేలుతుంటారు. ఈ క్రమంలోనే నిత్యం సోషల్ మీడియాలో వేలాది వీడియోలు హల్చల్ చేస్తూ ఉంటాయి. ఈ సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలే కాదు సామాన్య ప్రజలు కూడా పాపులర్ అవ్వడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిసార్లు అయితే ప్రాణాలు తెగించి మరి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో ఓ మహిళ స్నానం చేస్తు రీల్స్ చేసింది. అది చూసిన నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ వీడియో దేశమంతటా వైరల్ అయింది. ఈ వీడియో పై పోలీసులు అధికారులు సైతం ఆగ్రహానికి గురయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ ఆలయం అయిన అయోధ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటైన అయోధ్య లోని రామ మందిరం చూడడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తుంటారు. ఈ క్రమంలోనే సరయు నది ఒడ్డున ఉన్న రామ్ కి పైడి ఘాటు వద్ద భక్తులు భక్తిశ్రద్ధలతో స్నానాలు ఆచరిస్తుంటారు.

Women reels in Ayodhya temple

Women reels in Ayodhya temple

భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ స్థలంలో ఓ మహిళ చేసిన నిర్వాకం అందరి ఆగ్రహానికి కారణం అయింది. దైవదర్శనానికి వచ్చిన మహిళ నదిలో రీల్స్ చేయడానికి సిద్ధమయింది. వీటిలో స్నానం చేస్తూ హిందీ పాటకు అసభ్యకర రీతిలో డ్యాన్స్ చేసింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరకు ఈ వీడియో పోలీసుల వరకు వెళ్ళింది. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆలయాలు, ప్రార్థన స్థలాల వద్ద ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దని పోలీసులు పలుమార్లు హెచ్చరించారు. కానీ తాజాగా ఈ మహిళ వీడియోతో భక్తులలో ఆగ్రహ ఆవేశాలు పెరిగాయి. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుచేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది