Viral Video వీడియో : బెంగళూరు మెట్రో ట్రైన్ లో ఈ యువతీ చేసిన పనికి తోటి ప్రయాణికులు షాక్..!!
Viral Video : ఇటీవల మెట్రో రైల్ లలో రకరకాల వింత సంఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. నార్త్ ఇండియాలో ఢిల్లీ వంటి చోట్ల మెట్రో రైల్ లో ప్రేమికులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. దీంతో సామాన్య ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో రైల్లో విచ్చలవిడిగా ప్రేమికులు ఆకతాయి పనులు చేస్తూ ఉండటంతో కొంతమంది ప్రభుత్వాలకు కూడా ఫిర్యాదు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మరో పక్క సోషల్ మీడియాలో గుర్తింపు సంపాదించుకోవడానికి.. మెట్రో ట్రైన్ రన్నింగ్ లో ఉండగా అందరు కూర్చున్న సమయంలో కొంతమంది డ్యాన్సులు వేస్తూ వీడియోలు చేస్తున్నారు. ఈ రకంగానే తాజాగా మెట్రోలో ఓ అమ్మాయి చేసిన పనికి తోటి ప్రయాణికులు షాక్ తిన్నారు. ఓ యువతి బెంగళూరు మెట్రో ట్రైన్ లో తోటి ప్రయాణికులు అందరూ చూస్తుండగా పల్టీ జంప్ చేయడం జరిగింది. ఈ వీడియో నిషా శర్మ అనే వ్యక్తి తన సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.
ఆ యువతి ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో అక్కడి వారంతా షాక్ అయ్యారు. కొంతమంది ప్రయాణికులు ఆమె చేసినది నవ్వుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. మరోపక్క మెట్రో ట్రైన్ లో ఎటువంటి వీడియోలు చిత్రీకరించవద్దని… చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మెట్రో కార్పొరేషన్స్ హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా గాని యువత మెట్రో ట్రైన్ లలో రైల్వే ట్రాక్ ల వద్ద వీడియోలు క్రియేట్ చేస్తూనే ఉండటం బాధాకరం.
