Amaravati..రైతు సంక్షేమమే మా ప్రాధాన్యత: మంత్రి కన్నబాబు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Amaravati..రైతు సంక్షేమమే మా ప్రాధాన్యత: మంత్రి కన్నబాబు

 Authored By praveen | The Telugu News | Updated on :7 September 2021,10:27 pm

రైతు సంక్షేమం కోసం వైసీపీ సర్కారు కృషి చేస్తున్నదని, తమ సర్కారు గడిచిన రెండేళ్లలో రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని మంత్రి కన్నబాబు అన్నారు. మంగళవారం వ్యవసాయ అనుబంధ రంగాలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ నిర్వహించిన జాతీయ స్థాయి వర్చువల్‌ సమీక్షలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున మంత్రి కన్నబాబు అమరావతి నుంచి పాల్గొన్నారు. ఈ వర్చువల్ సమీక్షా సమావేశంలో ఏపీలో వ్యవసాయ రంగంలో సర్కారు తీసుకున్న చర్యల గురించి కన్నబాబు వివరించారు.

వైసీపీ ప్రభుత్వం కొవిడ్ పాండమిక్ వేళ పెద్ద ఎత్తున పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిందని తెలిపారు. రైతు ముంగిట మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు గడిచిన రెండేళ్లలో రైతులకు రూ.83వేల కోట్ల సాయం అందించినట్లు చెప్పారు. అన్నదాత సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రయారిటీ అని పేర్కొన్నారు. కొవిడ్ పాండమిక్ టైంలో దేశవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొందని, రాష్ట్రంలోనూ అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ రైతు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కనీస మద్దతు ధరకు రైతు వద్ద నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసిందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. గ్రామస్థాయిలోనూ రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు.

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది