Krishna..సీఎం జగన్ అన్ని మతాలను గౌరవిస్తారు: మంత్రి నాని | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Krishna..సీఎం జగన్ అన్ని మతాలను గౌరవిస్తారు: మంత్రి నాని

 Authored By praveen | The Telugu News | Updated on :7 September 2021,10:15 pm

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. మంగళవారం మంత్రి కొడాలి విజయవాడలో మాట్లాడుతూ గణేశ్ చతుర్థిపై టీడీపీ, బీజేపీ కావాలనే రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. దేశమంతా వినాయక చవితికి ఏ నిబంధనలు ఉన్నాయో రాష్ట్రంలోనూ అవే అమలులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఏపీలో అడ్రస్ లేని బీజేపీ రాజకీయం చేస్తూ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తోందని మంత్రి నాని మండిపడ్డారు.

బీజేపీ నేత సోము వీర్రాజుకి విగ్రహాలతోనూ వినాయక చవితితోనూ రాజకీయం చేయడం అలవాటేనని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ వినాయక చవితి అనుమతులపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు శవరాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ నేతలు కావాలనే వైసీపీ సర్కారుపై బురద చల్లాలని చూస్తున్నారని మంత్రి నాని అన్నారు. కొవిడ్‌తో ప్రజలకు ఇబ్బందులు వస్తాయనే పరిమితులు విధించుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారమే రాష్ట్రంలోనూ అనుమతులు ఉంటాయని చెప్పారు.

 

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది