Ananthapuram..‘ఈబిడ్’ కేసులో పురోగతి | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ananthapuram..‘ఈబిడ్’ కేసులో పురోగతి

లక్ష రూపాయలకు రూ.30 వేల వడ్డీ ఇస్తామని ఆశ చూపి ఈబిడ్‌ సంస్థ నిర్వాహకులు జిల్లాలో రూ.వందల కోట్లు వసూలు చేసి మోసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈబిడ్ సంస్థ చేతిలో 800 మందికిపైగా మోసపోయారు. కాగా, బాధితులు ఈ ఏడాది ఏప్రిల్‌లో అప్పటి ఎస్పీ సత్యయేసు బాబుకు కంప్లయింట్ చేశారు. ఆయన ఆదేశాల మేరకు ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆ ‘ఈబిడ్‌’ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కీలక […]

 Authored By praveen | The Telugu News | Updated on :7 September 2021,10:24 pm

లక్ష రూపాయలకు రూ.30 వేల వడ్డీ ఇస్తామని ఆశ చూపి ఈబిడ్‌ సంస్థ నిర్వాహకులు జిల్లాలో రూ.వందల కోట్లు వసూలు చేసి మోసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈబిడ్ సంస్థ చేతిలో 800 మందికిపైగా మోసపోయారు. కాగా, బాధితులు ఈ ఏడాది ఏప్రిల్‌లో అప్పటి ఎస్పీ సత్యయేసు బాబుకు కంప్లయింట్ చేశారు. ఆయన ఆదేశాల మేరకు ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆ ‘ఈబిడ్‌’ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కీలక నిందితుడు సునీల్‌ చౌదరిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.

మంగళవారం అతన్ని అనంతపురం కోర్టులో హాజరుపరిచారు. ధర్మవరం మండలానికి చెందిన సునీల్‌ చౌదరి, మహేంద్ర చౌదరిని కీలక నిందితులుగా పోలీసులు కనిపెట్టారు. వీరితో పాటు మహేంద్ర చౌదరి భార్య జాస్తి మాధవి, బావమరిది సుధాకర్‌ నాయుడు, అనుచరులు పుల్లానాయుడు తదితరులు ఈ స్కాంలో ఉన్నట్లు తేల్చారు. సునీల్‌చౌదరి 5 నెలలుగా అజ్ఞాతంలో ఉండగా, చివరకు సీఐడీ పోలీసులు అతడిని నాగపూర్‌లో అరెస్టు చేసి కోర్టుకు తీసుకొస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసులోని కొందరు నిందితులను పోలీసులు ఆల్రెడీ అరెస్టు చేసిన విషయం విదితమే.

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది