Ananthapuram..జయరాం మృతి పార్టీకి తీరని లోటు: ఎమ్మెల్యే ఉష
వైసీపీ సీనియర్ నాయకులు జయరాం పూజారి మృతి వైసీపీ పార్టీకి తీరని లోటని కల్యాణదుర్గం శాసన సభ్యురాలు ఉష అన్నారు. గుండెపోటుతో మరణించిన జయరాం పార్థివ దేహానికి ఎమ్మెల్యే పూల మాలలు వేసి బుధవారం నివాళులర్పించారు. పూజారి మృతి పట్ల సంతాపం తెలిపారు. జయరాం కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ఇచ్చారు. వైసీపీ తరఫున కుటుంబ సభ్యులకు అండగా అంటామని, అన్ని విధాల జయారం కుటుంబీకులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఉష హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ వైసీపీ పార్టీ బలోపేతం కోసం జయారం పూజారి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.
జయరాం నాయకత్వంలోనే వైఎస్ఆర్ పార్టీ జిల్లాలో, నియోజకవర్గంలో పట్టు సాధించగలిగిందని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుందకు ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు వైసీపీ పార్టీకి అతి ముఖ్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. జయరాం గుండెపోటుతో మరణించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఉషతో పాటు స్థానిక వైసీపీ నాయకులు జయరాం మృతదేహానికి నివాళులర్పించారు. జయరాం అంత్యక్రియలను బుధవారం నిర్వహించనున్నారు.