JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డి + 120 మంది అరెస్ట్ ??
JC Prabhakar Reddy : తాడిపత్రి రాజకీయాలు అంటేనే రసవత్తరంగా ఉంటాయి. ఓవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే అక్కడ భగ్గుమంటుంది. మాట యుద్ధమే అక్కడ. కానీ.. తాజాగా తాడిపత్రిలో చోటు చేసుకున్న ఘటన చివరకు కేసు నమోదు వరకు వెళ్లింది. మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 120 మంది టీడీపీ నేతలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
నిజానికి.. తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్లపైనే దాడి జరిగిందని, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. దాన్ని ఖండించారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా జేసీకి మద్దతు ఇచ్చారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్ ముందు తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి బైఠాయించి ఆందోళనకు కూడా దిగారు. వైసీపీ నేతలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు అంటూ పోలీసులపై కూడా జేసీ విరుచుకుపడ్డారు. పోలీసులకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టడంపై జేసీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
JC Prabhakar Reddy : సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన జేసీ
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై, స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలపై కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు. క్రైమ్ రేటు ఇప్పుడు ఎందుకు పెరిగిందంటూ నిలదీశారు. అసలు.. శాంతి భద్రతలకు పరిరక్షణ ఉందా అంటూ విరుచుకుపడ్డారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీడీపీ శ్రేణులు మొత్తం తాడిపత్రి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన నిర్వహించడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. చివరకు తాడిపత్రి డీఎస్పీతో కూడా జేసీ వాగ్వాదానికి దిగారు. చివరకు టీడీపీ కార్పొరేటర్లపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు హామీ ఇవ్వడంతో జేసీ ఆందోళన విరమించారు. అయినప్పటికీ.. ఈ వ్యవహారంపై పోలీసులు జేసీతో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు.