Ayyanna Patrudu : కొడాలి నాని హరికృష్ణ ఇంట్లో.. వాడు అసలు రాజకీయ నాయకుడే కాదు… అయ్యన్న పాత్రుడు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ayyanna Patrudu : కొడాలి నాని హరికృష్ణ ఇంట్లో.. వాడు అసలు రాజకీయ నాయకుడే కాదు… అయ్యన్న పాత్రుడు…!

 Authored By tech | The Telugu News | Updated on :3 March 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Ayyanna Patrudu : కొడాలి నాని హరికృష్ణ ఇంట్లో.. వాడు అసలు రాజకీయ నాయకుడే కాదు... అయ్యన్న పాత్రుడు...!

Ayyanna Patrudu : చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు. ఈయన 1983 – 89 మరియు 1994 – 96 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ తరఫున నర్సీపట్నం నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యారు.అలాగే 1984-86 లో సాంకేతిక విద్య మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఇదే సమయంలో అయ్యన్న స్థానికంగా ప్రభుత్వ మరియు పాలిటెక్నిక్ సంస్థల ఏర్పాటుకు కృషి చేశారు. వీటితోపాటు ప్రభుత్వ సాంకేతిక శిక్షణ సంస్థ, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కూడా ఆయన కృషి చేయడం జరిగింది. అలాగే 1494 – 96 లో రహదారుల మరియు భవన శాఖ మంత్రిగా కూడా అయ్యన్న పాత్రుడు పనిచేయడం జరిగింది. ఇక అప్పట్లో నియోజకవర్గ పరిధిలోని మారుమూల గ్రామాల్లో సైతం వందల కిలోమీటర్ల మేర పంచాయతీ రాజ్ రోడ్డును బదలాయించి పూర్తిస్థాయిలో అభివృద్ధికి కృషి చేశారు. అదేవిధంగా 1996 లో 11వ లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అనకాపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసి లోక్ సభ సభ్యుడుగా కూడా ఎన్నికయ్యారు.అదేవిధంగా 1999లో జరిగిన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యన్న పాత్రుడు అటవీ శాఖ మంత్రిగా పదవిని స్వీకరించడం జరిగింది.

ఇక ఆ సమయంలో విడుమికొండ నర్సరీ ఆరిలోవ ఔషధ మొక్కల పెంపకానికి ఆయన నిధులు కేటాయించి కృషి చేశారు. మరల 2004 ఎన్నికల్లో కూడా అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అయ్యన్నపాత్రుడు రాజకీయాలకు కాస్త దూరమయ్యారని చెప్పాలి. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ముత్యాలపాప చేతిలో అయ్యన్నపాత్రుడు ఓటమి చవి చూశాడు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో శాసనసభ్యుడిగా విజనం సాధించి మంత్రివర్గంలో నియమితుడయ్యాడు. ఇలా ఎప్పటినుండో టీడీపీలో కొనసాగుతున్న అయ్యన్నపాత్రుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గురించి అలాగే టీడీపీ పార్టీ గురించి అనేక రకాల విషయాలను తెలియజేశాడు అలాగే టీడీపీ పార్టీ గురించి అనేక రకాల విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఎన్ఆర్ మరియు ఎన్టీఆర్ గారు అన్నదమ్ములు లాగా ఉండేవారని.. ఇక వారిద్దరి మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు ఉన్నాయి అనేది వాస్తవం కాదని తెలియజేశారు. వారు అన్నదమ్ములా కలిసి ఉండేవారు కానీ వారి అభిమానులు ఒకరిపై ఒకరు విపరీతంగా దూషణలు చేసుకోవడం వలన వారిద్దరికీ అలాంటి పేరు వచ్చి ఉంటుందంటూ తెలియజేశారు. ఈ క్రమంలోనే టీడీపీ నుండి రాజకీయాల లోకి అడుగు పెట్టి ఇప్పుడు వైసీపీ జెండాలు మోస్తున్న కొడాలి నాని గురించి కూడా అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలాంటి వాడి గురించి మాట్లాడటం కూడా అసలు మంచిది కాదని ఒకప్పుడు కొడాలి నాని హరికృష్ణ ఇంట్లో ప్లేట్లు కడిగేవాడని వారి బిక్ష వలనే ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగలుగుతున్నాడని చెప్పుకొచ్చారు. అయితే వాస్తవానికి ఎవరి ఇష్టానుసారం వారు పార్టీ మారవచ్చు కానీ పార్టీ మారిన తర్వాత ఒకప్పుడు కొడాలి నాని రాజకీయ భవిష్యత్తుకు పునాది అయినటువంటి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని ఎన్టీ రామారావు ఫ్యామిలీని ఇష్టానుసారం తీవ్రమైన పదజాలంతో దూషించటం ఏమాత్రం కరెక్ట్ కాదని…ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలని ఈ సందర్భంగా అన్నయ్య పాత్రుడు చెప్పుకొచ్చారు.అతని రాజకీయ భవిష్యత్తుకు ఎంతగానో కృషి చేసినటువంటి చంద్రబాబును ఇప్పుడు వైసీపీ పార్టీ జెండా కప్పుకొని ఇష్టానుసారం బూతులు తిడుతున్న కొడాలి నాని గురించి, అలాంటి నీచమైన వ్యక్తి గురించి మాట్లాడడం కూడా అస్సలు మంచిది కాదంటూ ఈ సందర్భంగా అన్నయ్య పాత్రుడు తెలియజేశాడు. దీంతో ప్రస్తుతం అన్నయ్య పాత్రుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం లేపుతున్నాయి.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది