Pawan Kalyan : విజయసాయిరెడ్డి రాజీనామా.. ఢిల్లీ నుంచి పవన్‌కు పిలుపు !
ప్రధానాంశాలు:
Pawan Kalyan : విజయసాయిరెడ్డి రాజీనామా.. ఢిల్లీ నుంచి పవన్‌కు పిలుపు !
Pawan Kalyan : వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా Vijayasai Reddy నేపథ్యంలో Andhra Pradesh ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి BJP శరవేగంగా పావులు కదుపుతోంది. ఇటీవలే ఏపీ పర్యటనకు ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా వచ్చి వెళ్లారు. విజయసాయి రెడ్డి రాజీనామా వెనుక బిజెపి హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్ కు పిలుపు వచ్చినట్లుగా సమాచారం. విజయసాయిరెడ్డితో పాటు మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ కు ఢిల్లీ నుంచి పిలుపు రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏపీకి అడిగిన వెంటనే కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తు వస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుంటూ ఏపీలో బీజేపీ సానుకూలతను పెంచుకోవాలని చూస్తుంది. అదే సమయంలో బిజెపి బలమైన నాయకత్వం కోసం వెతుకుతుంది. వైసీపీ రాజ్యసభ సభ్యులను రాజీనామా చేయించి ఆ ఖాళీలను బిజెపి సొంతం చేసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం…
విజయసాయిరెడ్డి రాజీనామాపై జగన్ సైలెంట్
తద్వారా వైసిపిని దెబ్బతీయడంతో పాటు బిజెపి బలం పెంచుకోవచ్చు అన్నది ఆలోచనగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇదే విషయంపై టిడిపి అధినేత చంద్రబాబుతో బీజేపీ పెద్దలు చర్చించగా అందుకు ఆయన కూడా అంగీకరించినట్లుగా, ఆ తర్వాతే బిజెపి ప్లాన్ ప్రారంభమైనట్లు సమాచారం.విజయసాయిరెడ్డి రాజీనామాపై జగన్ ఇంతవరకు స్పందించలేదు. దీంతో బీజేపీ హస్తం ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటును మెగాస్టార్ చిరంజీవితో భర్తీ చేయాలన్న ఆలోచనలు బిజెపి ఉన్నట్లు ప్రచారం సాగుతుంది.
ఇటీవల బిజెపి పెద్దలతో చిరంజీవి సన్నిహితంగా మెలుగుతుండడం కూడా ఈ ఊహాగానాలకు ఊతమిచ్చినట్లు అయింది. ప్రస్తుతం చిరంజీవి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఉన్నారు. కూటమికి పరోక్ష మద్దతు తెలుపుతూ వస్తున్నారు. చిరంజీవికి రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా కాపుల్లో సానుకూలత లభిస్తుందన్నది బిజెపి ప్లాన్‌గా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను ఢిల్లీకి పిలిచి ఇదే విషయం చెప్పబోతున్నట్లు సమాచారం.