Chandrababu : చంద్ర‌బాబు స్పెష‌ల్ స్టేట‌స్ సాధిస్తారా.. దాని వ‌ల‌న ఉప‌యోగాలు ఏంటి? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Chandrababu : చంద్ర‌బాబు స్పెష‌ల్ స్టేట‌స్ సాధిస్తారా.. దాని వ‌ల‌న ఉప‌యోగాలు ఏంటి?

Chandrababu : తెలంగాణ‌, ఆంధ్ర‌ప్రదేశ్‌లు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన‌ప్ప‌టి నుండి ఏపీ స్పెష‌ల్ స్టేట‌స్ కోసం ఎంతో ప్ర‌య‌త్నిస్తుంది. కాని అది ఇద్ద‌రు సీఎంల వ‌ల్ల కాలేదు. 2014లో చంద్ర‌బాబు ఎంతో ప్ర‌య‌త్నించాడు. కాని సఫలీకృతం కాలేదు. త‌ర్వాత సీఎం జ‌గ‌న్ వ‌ల‌న కూడా స్పెష‌ల్ స్టేట‌స్ రాలేదు. అయితే ఈ సారి చంద్ర‌బాబు ప‌క్కాగా సాధిస్తాడని అంటున్నారు. అందుకు కార‌ణం తాజాగా వచ్చిన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టాలంటే ఏపీ నుంచి పార్లమెంటుకు […]

 Authored By ramu | The Telugu News | Updated on :8 June 2024,1:28 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu : చంద్ర‌బాబు స్పెష‌ల్ స్టేట‌స్ సాధిస్తారా.. దాని వ‌ల‌న ఉప‌యోగాలు ఏంటి?

Chandrababu : తెలంగాణ‌, ఆంధ్ర‌ప్రదేశ్‌లు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన‌ప్ప‌టి నుండి ఏపీ స్పెష‌ల్ స్టేట‌స్ కోసం ఎంతో ప్ర‌య‌త్నిస్తుంది. కాని అది ఇద్ద‌రు సీఎంల వ‌ల్ల కాలేదు. 2014లో చంద్ర‌బాబు ఎంతో ప్ర‌య‌త్నించాడు. కాని సఫలీకృతం కాలేదు. త‌ర్వాత సీఎం జ‌గ‌న్ వ‌ల‌న కూడా స్పెష‌ల్ స్టేట‌స్ రాలేదు. అయితే ఈ సారి చంద్ర‌బాబు ప‌క్కాగా సాధిస్తాడని అంటున్నారు. అందుకు కార‌ణం తాజాగా వచ్చిన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టాలంటే ఏపీ నుంచి పార్లమెంటుకు ఎంపికైన అభ్యర్థుల మద్దతు తప్పనిసరి. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు డిమాండ్స్‌కి మోదీ ప్ర‌భుత్వం త‌ప్ప‌క తలొగ్గి తీరుతుంద‌ని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా హైదరాబాద్ తెలంగాణకు రాగా.. ఏపీకి రాజధాని లేకుండా పోయింది.

Chandrababu ప్ర‌త్యేక హోదా వ‌లన ఇది ఉప‌యోగం..

తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కావడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. ఇక పేదరికం, ఆర్థికంగా వెనుకబడడం అనే కారణాలతో తమకు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని ఎప్పటి నుంచో బీహార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేయాలన్నా.. నరేంద్ర మోదీ.. మరోసారి ప్రధానమంత్రి కావాలన్నా.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ.. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీలకు సంబంధించిన ఎంపీలే కీలకం కానున్నారు. అయితే ఇప్పుడు మోదీకి సపోర్ట్ చేయాలంటే.. ఏపీ, బీహార్‌లు తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌ను కేంద్రం ముందు ఉంచే అవకాశాలు ఉన్నాయి.

Chandrababu చంద్ర‌బాబు స్పెష‌ల్ స్టేట‌స్ సాధిస్తారా దాని వ‌ల‌న ఉప‌యోగాలు ఏంటి

Chandrababu : చంద్ర‌బాబు స్పెష‌ల్ స్టేట‌స్ సాధిస్తారా.. దాని వ‌ల‌న ఉప‌యోగాలు ఏంటి?

భారత రాజ్యాంగంలో అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా లేదు. కానీ 5 వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి 1969 లో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే అవకాశం కల్పించారు. ప్రత్యేక హోదా అమల్లోకి వచ్చిన మొదట్లో కేవలం అస్సాం, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు మాత్రమే స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. ఆ తర్వాత మరో 8 రాష్ట్రాలకు కూడా ఈ ప్రత్యేక హోదా కల్పించారు. ప్రస్తుతం అరుణాచల్‌ ప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. ప్ర‌త్యేక హోదా వ‌ల‌న స్థానిక హ‌క్కులు ర‌క్షించ‌బ‌డ‌డం జ‌రుగుతుంది.ప్ర‌త్యేక మిన‌హాయింపులు, ప్ర‌త్యేక గ్రాంట్స్ ల‌భిస్తాయి. ఈ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ మొత్తం ప్రణాళిక వ్యయంలో దాదాపు 30 శాతం పొందుతాయి. సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరంలో విడుదలైన మొత్తం నిధులు ఖర్చు చేయకపోతే అవి లాప్స్ అవుతాయి. కాని ప్రత్యేక హోదా కల్గిన రాష్ట్రాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది