KTR : వెనక్కు తగ్గిన కేటీఆర్.. అదీ జగన్ పవర్ అంటే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KTR : వెనక్కు తగ్గిన కేటీఆర్.. అదీ జగన్ పవర్ అంటే..

 Authored By prabhas | The Telugu News | Updated on :30 April 2022,3:30 pm

KTR : కేటీఆర్ ( కల్వకుంట్ల తారక రామారావ్) పాతికేళ్ల క్రితం తండ్రి చాటు బిడ్డగా ఉండి గడిచిన 10 సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయాన్ని హీటెక్కిస్తున్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని కాస్త అభివృద్ధి వైపు నడిపిస్తున్నాడు కేటీఆర్. రాజకీయ ప్రత్యర్థులను తండ్రిలాగే చీల్చి చెండాడడంలో అందె వేసిన చేయి ఆయన ది.

KTR apologizes for his remarks on Andhra Pradesh

KTR apologizes for his remarks on Andhra Pradesh

ఇదిలా ఉంటే తాజాగా అంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలన బాగాలేదు అన్నట్టు పరోక్షంగా అక్కడి సమస్యలను వ్యంగంగా ఒక పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు. క్రెడాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ లో కేటీఆర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో నీళ్లు లేవు, రోడ్లు సరిగ్గాలేవు, కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని కేటీఆర్ విమర్షించాడు. అయితే ఆయన చేసిన విమర్శకు ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు, అధికార పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ హీట్ ను పెంచేశాయి.

కేటీఆర్ కు కౌంటర్…

అధికార పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇదేమి ఎన్నికల సీజన్ కాదని మీ తప్పులను కప్పిపుచ్చుకోడానికి ఇతర రాష్ట్రాల గురించి తప్పుగా మాట్లాడడం సిగ్గుచేటు అంటూ మాటల తూటాలు పేల్చారు. చిత్తశుద్ధి ఉంటే 8 ఏళ్లుగా తెలంగాణ ను కేటీఆర్ ఎంత అభివృద్ధి చేశాడు చెప్పాలని డిమాండ్ చేశారు. అధిక రాబడి వున్న తెలంగాణ ను మీకిచ్చి చిల్లిగవ్వ కూడా లేని అంధ్రప్రదేశ్ ను విడగొట్టరాని అన్నారు. ఇలాంటి స్థితిలో వున్న కూడా అన్ని రంగాల్లో అంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చురకలంటించారు.

తన మీద విమర్శల దాడి అధికం కావడంతో కేటీఆర్ దిగొచ్చాడు. ట్విట్టర్ వేదికగా తన వివరణ ఇచ్చుకున్నాడు. తాను చేసిన ఆరోపణల ద్వారా నా స్నేహితుల మనసు కొంత బాధకలిగిండొచ్చు క్రెడాయ్ మీటింగ్ లో కొంతమంది మిత్రులు చెప్పిన విషయాలను నేను చెప్పాను అంతేగాని ఎవ్వరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదన్నారు. ఎవరినో కించపర్చాలని, బాధ పెట్టాలని నేను మాట్లాడలేదని వివరణ ఇచ్చాడు. ఎవ్వరు బాధపడొద్దన్నారు. అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నా సోదరుడి లాంటి వాడని ఆయన ఆధ్వర్యంలో ఆంద్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడే ఆస్కారం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది