Nadendla Manohar : నారా లోకేష్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జనసేన అధినేత నాదెండ్ల మనోహర్ ..!
ప్రధానాంశాలు:
Nadendla Manohar : నారా లోకేష్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జనసేన అధినేత నాదెండ్ల మనోహర్ ..
Nadendla Manohar : మంగళగిరి జనసేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జనసేన అధినేత నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ సలహాదారుల వలన వేల కోట్ల ప్రజాధనం వృధా అవుతుందని, వారి వల్ల ఎవరికి ప్రయోజనం అని ప్రశ్నించారు. సీఎం సలహాదారుల పేరుతో 680 కోట్లు ఖర్చు చేశారంటలు నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సలహాదారులపై కోర్టుకు కూడా వెళ్ళామని చెప్పారు.డివిజన్ బెంచ్ ఈ వివరాలను కోర్టుకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది అన్నారు.సలహాదారుల వలన ప్రభుత్వంలో కొత్త విధానాన్ని తెచ్చామని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది అన్నారు. సలహాదారులుగా నియమించినట్లు చెప్పారు అన్నారు. వారందరికీ జీతాలు, అలవెన్స్, సదుపాయాలు సిబ్బందిని ప్రభుత్వమే అందిస్తుందన్నారు.సలహాదారులు సీఎం ని కలిసే పరిస్థితి లేదన్నారు.విలువలతో ఉన్న ప్రభుత్వ సలహాదారులు కొంతమంది తమకు పని లేదంటూ రాజీనామా చేసి వెళ్లిపోయారని గుర్తు చేశారు.సుభాష్ గర్గ్, రామచంద్రమూర్తి, జుల్ఫీ వంటి వారు ఈ పదవికి రాజీనామా చేశారని తెలిపారు.
80 నుంచి 90 మంది సలహాదారుల కోసం 680 కోట్ల రూపాయలను జగన్ సర్కార్ ఖర్చు పెట్టిందని మండిపడ్డారు. వీరిలో ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరికే 140 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. అసలు ఈ సలహాదారులు ప్రభుత్వానికి సీఎంకు ఎలాంటి సలహాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఉన్నత పాఠశాలలో వసతులు కల్పించకుండా, ఐబీ సిలబస్ అమలు చేస్తున్నామని అంటున్నారని, ఏ సలహాదారు చెబితే ఈ విద్యా విధానంలో మార్పు తెచ్చారు నిలదీశారు.వీరి వలన ప్రజలకు రాష్ట్రానికి ఏం మేలు జరిగిందో ప్రభుత్వం చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఎంతమంది సలహాదారులు ఉన్నారు వారెవరో కనీసం సీఎంకు కూడా తెలియదని ఎద్దేవా చేశారు. సీఎం తో రోజు మాట్లాడేది కేవలం ఇద్దరు సలహాదారులు మాత్రమేనని చెప్పారు. సీఎం మీడియా ముందుకు వచ్చి తాను పెట్టుకున్న సలహాదారులు గురించి వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సొమ్మును తింటూ ప్రతిపక్షాలను సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శిస్తాడని మండిపడ్డారు. వారి సలహాల వల్ల ఏ అంశాలలో మార్పు జరిగిందో చెప్పాలని పూర్తి వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలను వదిలేసి సలహాదారుల కోసం సీఎం వైఎస్ జగన్ 680 కోట్లు ఖర్చు పెడతారా అని ప్రశ్నించారు. శాసనసభ సమావేశాలలో చెప్పాలని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
ఇక టీడీపీ జనసేన పొత్తు లో అంతర్గతంగా విభేదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల నారా చంద్రబాబు నాయుడు జనసేనకు తెలియకుండా ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు. ఇలా రెండు పార్టీల మధ్య పొత్తు సమన్వయం కుదరడం లేదనిపిస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు కూడా నారా లోకేష్ ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన పొత్తు గెలిస్తే ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ను నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉండిపోయారు.