Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ గాజు గ్లాస్ రాజకీయం కొత్తగా ఉందిగా.. జనసేన ప్రమోషన్‌గా ఉందంటూ కొందరు కామెంట్స్..!
ప్రధానాంశాలు:
Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సంగ్ గాజు గ్లాస్ రాజకీయం కొత్తగా ఉందిగా.. జనసేన ప్రమోషన్‌గా ఉందంటూ కొందరు కామెంట్స్..!
Ustaad Bhagat Singh : టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చి రాజకీయాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. బ్రో సినిమా తర్వాత పవన్ నుండి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం పవన్ ఖాతాలో పలు సినిమాలు ఉన్నప్పటికీ వాటి విడుదలకి మోక్షం రావడం లేదు. ఎలక్షన్స్ తర్వాతనే పవన్ ఆ సినిమాల షూటింగ్ పూర్తి చేయనున్నట్టు టాక్. అయితే గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూనే ఉంది. గత ఏడాది ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ ఓ వారం రోజులు కేటాయించడంతో ఆ సమయంలో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ను హరీష్ శంకర్ చిత్రీకరించాడు.
అయితే అమెజాన్ ఈవెంట్ కోసం ఈ సినిమాకి సంబంధించి ఓ గ్లింప్స్ రూపొందించి విడుదల చేశారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్పేశాడు. తాజాగా విడుదలైన ఈ టీజర్ దుమ్ము రేపుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ అందరికి తెగ నచ్చేసింది. అయితే పవన్ డైలాగ్స్ కూడా హాట్ టాపిక్ అయ్యాయి. టీజర్‌లో ఇది నీ రేంజ్ అంటూ టీ గ్లాసుని రౌడీ కిందపడేయడం.. పగిలిన కొద్దీ పదునెక్కుతుందంటూ గ్లాసు గురించి పవన్ కళ్యాణ్ చెబుతుండడం ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించింది. ఈ గ్లింప్స్ చూస్తుంటే గాజు గ్లాసు, ఎర్ర తుండు కనిపిస్తూ ఉండగా, ఇది సినిమానా? జనసేన ప్రమోషనా? అన్న అనుమానం అందరిలో కలుగుతుంది.
గ్లాస్ అంటే కనిపించని సైన్యం.. పగిలే కొద్ది పదును ఎక్కుతుంది.. అనే డైలాగ్స్ తో పాటు ప్రతీ షాట్, ప్రతీ సీన్ కూడా జనసేను గుర్తు చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. టీజర్‌పై మంచి రెస్పాన్స్ వస్తుండగా, పూనమ్ కౌర్ ఆసక్తికర కామెంట్ చేసింది. ఇందులో పవన్ కళ్యాణ్ కన్నా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌కే ఎక్కువ మార్కులు ఇచ్చింది. అయితే వారం రోజులలో ఇలాంటి ఔట్‌పుట్ తీసుకు వచ్చిన హరీష్ శంకర్‌పై కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. బీజీఎం, కెమెరా వర్క్ అన్నీ కూడా అదిరిపోవడంతో గబ్బర్ సింగ్ వైబ్స్ కనిపిస్తున్నాయని కొందరు ముచ్చటించుకుంటున్నారు. ఏది ఏమైన ఎలక్షన్స్ సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుందనే చెప్పాలి.