Bobbili Constituency : బొబ్బిలిలో టిడిపి విజయం సాధ్యమేనా… వైసిపి తరఫున కొత్త మొఖం ఎవరు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bobbili Constituency : బొబ్బిలిలో టిడిపి విజయం సాధ్యమేనా… వైసిపి తరఫున కొత్త మొఖం ఎవరు…?

Bobbili Constituency : ఎప్పటినుండో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మొఖం వాచిన సీటుగా బొబ్బిలని చెబుతూ ఉంటారు. ఇక ఈ బొబ్బిలిలో టిడిపి పుట్టిన దగ్గర నుండి కేవలం రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది. ఇక ఈ రెండుసార్లు 1985లో ఒకసారి 1994లో మరోసారి గెలవగా ఆ రెండు సార్లు కూడా ప్రస్తుతం వైసీపీ సీటింగ్ ఎమ్మెల్యే కొనసాగుతున్న శంబంగి చిన్న అప్పలనాయుడు టిడిపి అభ్యర్థిగా పార్టీని గెలిపించాడు.అయితే తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత 1983 […]

 Authored By aruna | The Telugu News | Updated on :16 January 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Bobbili Constituency : బొబ్బిలిలో టిడిపి విజయం సాధ్యమేనా... వైసిపి తరఫున కొత్త మొఖం ఎవరు...?

Bobbili Constituency : ఎప్పటినుండో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మొఖం వాచిన సీటుగా బొబ్బిలని చెబుతూ ఉంటారు. ఇక ఈ బొబ్బిలిలో టిడిపి పుట్టిన దగ్గర నుండి కేవలం రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది. ఇక ఈ రెండుసార్లు 1985లో ఒకసారి 1994లో మరోసారి గెలవగా ఆ రెండు సార్లు కూడా ప్రస్తుతం వైసీపీ సీటింగ్ ఎమ్మెల్యే కొనసాగుతున్న శంబంగి చిన్న అప్పలనాయుడు టిడిపి అభ్యర్థిగా పార్టీని గెలిపించాడు.అయితే తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత 1983 నుండి చూసినట్లయితే ఇప్పటివరకు దాదాపు 9 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక దీనిలో నాలుగు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం గెలవగా , రెండుసార్లు టిడిపి మరో రెండు సార్లు వైసిపి ,ఒకసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా శంబంగి విజయం సాధించారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన శంబంగి కి రికార్డు స్థాయి చరిత్ర ఉందని చెప్పాలి. 1983లో భారీగా ఉన్న టిడిపి వేవ్ లో కూడా ఇండిపెండెంట్ గా నిలబడి బొబ్బిలిలో గెలిచిన శంబంగి గురించి కచ్చితంగా ఆలోచించాల్సిందే.

నిజం చెప్పాలంటే ఇక్కడ సీటు కాంగ్రెస్ వైఫై ఎక్కువసార్లు మొగ్గు చూపుతూ వచ్చింది. ఇక ఇక్కడ బొబ్బిలి రాజులకు మరియు విజయనగరం రాజులకు చారిత్రాత్మకమైన వైరం ఉండడం వలన దాని ప్రభావం రాజకీయంగా కూడా చూపించిందని చెప్పుకోవాలి. టిడిపి వైపు విజనగరం రాజులు ఉండటంతో బొబ్బిలి ఎప్పుడు కాంగ్రెస్ కే జై కొడుతూ వచ్చింది. ఇక ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగైనా తర్వాత ఈ సీటు కాస్త వైసీపీకి మళ్ళింది.అందుకే ఇప్పటికీ బొబ్బిలి వైసిపికి గట్టి పట్టు ఉన్న సీటుగా నిలబడింది. అయితే ఈసారి మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న శంబంగి ని మార్చాలనే ఆలోచనలో వైసిపి అధిష్టానం ఉందని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం బొబ్బిలిలో వైసిపి అభ్యర్థి ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న శంబంగి చిన్న అప్పలనాయుడు కి ఈసారి టికెట్ ఇవ్వరని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక ఆయన పనితీరు పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. దీంతో కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ సాగుతున్నట్లుగా సమాచారం.

ఇక 2018లో ఎవరు ఊహించని విధంగా బొబ్బిలి రాజులు టిడిపి వైపు మొగ్గు చూపారు. వైసీపీ నుండి గెలిచిన సుజయ కృష్ణ రంగారావు టిడిపిలో చేరడం వలన ఆయనకు మంత్రి పదవి కూడా లభించింది. అనంతరం 2019లో ఆయన పోటీ చేయగా తొలిసారి ఓటమి ఎదురైంది. ఇక ఇప్పుడు 2024 ఎన్నికలలో ఆయన తమ్ముడు బేబీ నాయన పోటీ చేస్తున్నారని సమాచారం. మరోవైపు బొబ్బిలిలో మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ఆలోచనలో వైసిపి ఉంది. అలాగే సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా బొబ్బిలి రాజులను ఓడించే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇది ఇలా కొనసాగుతుండగా వైసిపి తరఫున పోటీ చేసే ఆ కొత్త ముఖం ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఆ కొత్త మొఖం ఎవరు అనేది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది