Business Idea : కార్పొరేట్ జాబ్స్ మానేసి ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ అమ్ముతూ 3 కోట్లు సంపాదించిన జంట
Business Idea : గౌరీ గోపీనాథ్, కృష్ణన్ సుబ్రమణియన్ తమ కార్పొరేట్ ఉద్యోగాలు మానేసి పర్యావరణ అనుకూల క్లాత్ బ్యాగులను తయారు చేస్తూ మంచి లాభాలు సాధిస్తున్నారు. సంవత్సరానికి రూ. 3 కోట్లు ఆర్జిస్తున్నారు. బెంగళూరు, చెన్నైలలో వివిధ కార్పొరేట కంపెనీల్లో పని చేసిన గౌరీ గోపీనాథ్, కృష్ణన్ సుబ్రమణియన్ దంపతులు ఈ హడావుడి కార్పొరేట్ జీవితాన్ని వదిలి తమ స్వస్థలానికి వెళ్లిపోవాలని ఎప్పుడూ అనుకునే వారు. అలాగే తమ ఉద్యోగాలను వదిలి మధురైకి వెళ్లిపోయారు. తమ చుట్టూ ప్లాస్టిక్ వాడకం ఎంత ఉందో గమనించిన ఆ దంపతులు దానినే ఉపాధి మార్గంగా మల్చుకోవాలని భావించారు. వస్త్రంతో బ్యాగులను తయారు చేసి విక్రయించాలనుకున్నారు.
చిన్న స్థాయిలో మొదలు పెట్టిన బిజినెస్ క్రమంగా వినియోగదారుల ఆదరణ పొందింది. వారికి ఆర్డర్లు ఎక్కువగా రావడం మొదలైంది. దాంతో 2014లో YellowBag అనే సంస్థను స్థాపించారు. ఎనిమిదేళ్ల తర్వాత, ఈ కార్యక్రమం మదురైలో పూర్తి స్థాయి సామాజిక సంస్థగా మారింది. క్లాత్ బ్యాగ్‌లను ఉత్పత్తి చేయడంతో పాటు వందలాది మంది అట్టడుగు మహిళలకు ఉపాధి ద్వారా సాధికారత కల్పిస్తున్నారు. 2019లో ఒక NGO — YellowBag Foundation ను స్థాపించారు.పత్తి, జూట్ తో వినియోగదారుల అవసరాల కోసం వివిధ రకాల బ్యాగ్ లను అందిస్తున్నారు. ప్రస్తుతం, YellowBag ప్యాకేజింగ్ బ్యాగ్‌లు, గార్మెంట్ ప్రొటెక్టర్ బ్యాగ్‌లు, టోట్స్ మరియు డ్రాస్ట్రింగ్ బ్యాగ్‌లను అందిస్తోంది.వెబ్‌సైట్ ద్వారా లేదా అనేక సోషల్
ఉత్పత్తులు రూ. 20 నుండి మొదలై రూ. 200 వరకు ఉంటాయి. మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మార్కెట్ చేస్తున్నారు. US, UK మరియు ఆస్ట్రియాతో సహా వివిధ దేశాలకు YelloBag ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.కరోనా ప్రబలక ముందు YelloBag సంస్థలో 250 మంది మహిళలు పని చేసేవారు. ప్రస్తుతం 40 మంది పనిచేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలోనూ YelloBag సంస్థ పని చేయడం మాత్రం ఆపలేదు. బ్యాగ్ ల గిరాకీ పూర్తిగా తగ్గిపోవడంతో.. మాస్కులను తయారు చేసి విక్రయించారు.2019లో గౌరీ గోపీనాథ్, కృష్ణన్ సుబ్రమణియన్ దంపతులు పిల్లల కోసం ట్యూషన్ సెంటర్ అయిన ప్రాజెక్ట్ గ్రీన్ స్లేట్ ను ప్రారంభించారు. తర్వాత 6 నుండి 8 తరగతుల పిల్లల్లో నైపుణ్యాలు మరియు విశ్వాసాన్ని పెంపొందించడం కోసం 40-వారాల లాంగ్-లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.