Income Tax : ఈ సారి బడ్జెట్‌లో ఏముండనుంది.. శ్లాబుల సంగతేంటి..!
ప్రధానాంశాలు:
Income Tax : ఈ సారి బడ్జెట్‌లో ఏముండనుంది.. శ్లాబుల సంగతేంటి..!
Income Tax : బడ్జెట్ టైం వచ్చిందంటే కొందరికి గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయం. బడ్జెట్‌లో వేటి రేట్లు పెరుగుతాయి, ఏవి ఎలా ఉంటాయి అనే దానిపై అందరిలో టెన్షన్ ఉంటుంది. 2025 బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అంటే దేశంలోని 64 ఏళ్ల ఆదాయపు పన్నుకు సంబంధించిన చట్టం మారవచ్చు. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాన్ని సులభతరం చేయడం, అర్థమయ్యేలా చేయడం, పేజీల సంఖ్యను దాదాపు 60 శాతం తగ్గించడం ఈ కొత్త బిల్లు లక్ష్యం. మన దేశంలో పరిమితికి మించి సంపాదిస్తున్న చాలా మంది.. ఐటీఆర్ ఫైలింగ్ మాత్రం చేయట్లేదు. ఏటా ఈ సంఖ్యను పెంచాలని కేంద్రం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది.
Income Tax విష్ లిస్ట్ ఇదే..
ఇందులో భాగంగానే 2020-21 ఆర్థిక సంవత్సరంలో కీలక మార్పులతో.. టాక్స్‌పేయర్లను ఆకర్షిస్తూ కొత్త పన్ను విధానం తీసుకొచ్చింది. పాత పన్ను విధానంతో పోలిస్తే ఇందులో శ్లాబులు తక్కువ. ఇంకా సరళంగా కూడా ఉంటుంది. దీంట్లో పాత దాంతో పోలిస్తే టాక్స్ రేట్లు కూడా తక్కువగానే ఉంటాయి. అందుకే దీనిని డీఫాల్ట్‌గా చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 70 శాతానికిపైగా టాక్స్‌పేయర్స్.. కొత్త పన్ను విధానంలోనే ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. గత కొన్ని ఎన్నికల్లో మహిళలకు రాజకీయంగా ప్రాధాన్యత పెరుగుతుండడంతో నగదు బదిలీ పథకాలకు ప్రాధాన్యం పెరిగింది. అయితే, జెండర్ బడ్జెట్ ప్రక్రియ నుంచి మంత్రిత్వ శాఖలు దాదాపుగా తప్పుకున్నాయని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.
ప్రీ-బడ్జెట్ చర్చల్లో కూడా మహిళల అవసరాలపై సమగ్ర చర్చ జరగడం లేదు. సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వ్యాధులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ పథకాల ద్వారా సాయం అందించాలని చెప్పారు. అలాగే శ్రామిక మహిళలకు పొదుపు ఇంకా గృహనిర్మాణంపై చాలా దృష్టి పెట్టాలి. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87A రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను రిబేట్ వర్తిస్తుంది. అంటే ఇక్కడ ఎలాంటి టాక్స్ చెల్లించనక్కర్లేదు. ఇంకా స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ. 75 లక్షల వరకు అదనంగా పన్ను ఉండదు. అప్పుడు రూ. 7.75 లక్షల వరకు ఆదాయంపై కొత్త పన్ను విధానంలో పైసా పన్ను పడదు. అందుకే ఇది చాలా మందికి ఆకర్షణీయంగా ఉంది. ఇక పన్ను విధానాన్ని మరింత సరళీకరించడంలో భాగంగా.. టాక్స్ శ్లాబుల్ని 6 నుంచి 3 శ్లాబులకు కుదించాలని డిమాండ్ చేస్తున్నారు. మెట్రో నగరాల్లో హౌస్ రెంట్ అలవెన్స్ పరిమితి పెంచాలని కూడా డిమాండ్లలో ఒకటిగా ఉంది. ఇది బేసిక్ శాలరీలో కనీసం 50 శాతంగా ఉంచాలన్న డిమాండ్ ఉంది.