Business idea : మెకానికల్ ఇంజనీర్… ఆర్గానిక్ తేనె అమ్ముతూ కోట్లు సంపాదించాడు.. ఎలాగో తెలుసా
Business idea : ఎన్ఐటీ జైపూరలో మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేశాడు.. పెద్దపెద్ద కంపెనీల్లో ఉద్యోగం.. ఆ తర్వత సొంతగా వ్యాపారం.. ఇవేవి అతని అంతగా కిక్ ఇవ్వలేదు.. ఇంకా ఏదో చెయ్యాలనే ఆలోచన.. కెమికల్స్ తో మగ్గిపోతున్న సమాజానికి మంచి ఆహారం ఇవ్వాలనుకున్నాడు.. స్వచ్ఛమైన తేనెను జనానికి అందించాలని ప్రారంభించిన వ్యాపారం రజనీష్ కు సిరులు కురిపిస్తుంది. సంవత్సరానికి 60 టన్నుల తేనెను ఉత్పత్తి చేసి లాభాలు అర్జిస్తున్నారు రజనీష్. గురు గ్రామ్ కు చెందిన మెకానికల్ ఇంజనీర్ రజనీష్ చావ్లా 2012లో సేంద్రీయ వ్యవసాయం చేయాలనే ఆశతో నైనిటాల్‌లో 10 ఎకరాల స్థలాన్ని కొన్నారు.“మార్కెట్‌లో లభించే పండ్లు, కూరగాయలు రసాయనాలతో నిండిపోతున్నాయి.
నేను సేంద్రీయ వ్యవసాయం ప్రారంభించటానికి ప్రధాన లక్ష్యం నా చుట్టూ ఉన్న ప్రజలకు తాజా ఆహారాన్ని అందించడమే” అని 52 ఏళ్ల రజనీష్ అన్నారు. 2014లో, నైనిటాల్‌లో సేంద్రీయ వ్యవసాయం ప్రారంభించిన రెండేళ్ల తర్వాత, రజనీష్‌కు తేనెటీగల పెంపకంలో లాభాలు ఎక్కువగా ఉంటాయని గ్రహించాడు. ప్రజలకు అడవి తేనె అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.’జిమ్ కార్బెట్.. నైనిటాల్ కు దగ్గరే.. జాతీయ ఉద్యాన వనంలో చాలా పూల మొక్కలు ఉంటాయి. నేను అవసరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాత తేనెటీగల పెట్టెలు అక్కడ ఉంచాను. ప్రస్తుతం, జిమ్ కార్బెట్‌లో దాదాపు 300 పెట్టెలు ఉన్నాయి.
‘- రజనీష్ చావ్లారజనీష్ చావ్లా.. రసాయన రహిత ఉత్పత్తులను అందించడానికి 2015లో ‘ఫార్మ్ నేచురల్’ అనే సంస్థ. ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా తేనె మాత్రమే కాకుండా.. నూనెలు, వెనిగర్ మరియు జ్యూస్‌లు అమ్ముతున్నారు. రజనీష్ రాజస్థాన్, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుండి వివిధ రకాల తేనెను కూడా సేకరించడం ప్రారంభించాడు.ప్రస్తుతం, ‘ఫార్మ్ నేచురల్ ‘ (Farm Naturelle) 40 ఉత్పత్తులు విక్రయిస్తోంది. 2015లో తమ కార్యకలాపాలను ప్రారంభించి నప్పటి నుంచి 10 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించారు. అంతే కాదు, ‘ఫార్మ్ నేచురల్ ద్వారా 250 మందికి పైగా ఉపాధి పొందుతున్నారు.