హారతిని ఇలా ఇస్తేనే ఫలితం వస్తుంది !

0
Advertisement

హారతి.. దేవుడికి పూజలో హారతి ఇచ్చే విధానంలో ఒక క్రమం ఉంటుంది. దాన్ని తప్పక పాటించాలి. ఆ విధానం గురించి తెలుసుకుందాం.. దేవుడికి పూజలో మనం హారతి పళ్ళాలను, లేక దీపాలను త్రిప్పుతున్నప్పుడు, ఏ పద్ధతిలో త్రిప్పాలన్న విషయమూ చెప్పబడింది. ముందుగా హారతితో దైవం ముందు త్రిప్పుతున్నప్పుడు, దైవం తల భాగం నుంచి పాదాల వరకు దీప హారతిని త్రిప్పాలి. రెండవసారి తిప్పే హారతి స్వామి ముఖం నుండి మోకాళ్ళ వరకు, మూడవ సారి తిప్పే హారతి మెడ, నడుము భాగాల మధ్య తిప్పాలని చెప్పబడింది.

ఎన్నిసార్లు హారతి ఇవ్వాలి ?

advantages of giving harathi
advantages of giving harathi

అయితే హారతిని ఎన్ని సార్లు ఇవ్వాలి అనే విశేషాలు పరిశీలిద్దాం…

దేవుడికి ముందు ఒకటికి లేక మూడు, ఐదు, ఏడు తొమ్మిది దీపాలతో కూడిన హారతులిస్తుంటారు. దేవాలయాలలో దీపహారతిని ఇచ్చేముందు మంత్రజలాన్ని చిలరించి, హారతిపళ్ళెం పిడి పై ఒక పుష్పాన్ని ఉంచి, తగిన హస్త ముద్రతో హారతిని స్వామి ముందు తిప్పుతూ ‘ఆముఖ దేవతాభ్యో నమః దీపం సమర్పయామి’ అనే మంత్రాన్ని పఠిస్తారు. హారతి పళ్ళానికి పిడి తప్పనిసరి. సాధారణంగా హారతి పళ్ళాలను ఇత్తడితో చేస్తుంటారు. వెండి హారతి పళ్ళాలను విరివిగా ఉపయోగిస్తుంటారు. హరతి ఇచ్చిన తర్వాత పీఠం పై పెట్టి దాని పిడిపై ఒక చుక్క నీరు ఊర్ధరిణితో వేసి తర్వాత మనం హరతిని తీసుకోవాలి. దిష్టి హరతి, కుంభహారతిలను కొన్ని ప్రాంతాలలో కళ్లకు అద్దుకోరు. వాటిని దూరం నుంచే నమస్కారం చేసుకుంటారు.

Advertisement