Zodiac Signs : సెప్టెంబర్ నెలలో తులారాశి వారిని నమ్మిన వారే ముంచేస్తారు.. జాగ్రత్త…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Zodiac Signs : సెప్టెంబర్ నెలలో తులారాశి వారిని నమ్మిన వారే ముంచేస్తారు.. జాగ్రత్త…!

Zodiac Signs : 2023 సెప్టెంబర్ నెల తులా రాశి వారికి ఈ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. వీరిని ఈ సమయంలో నమ్మిన వారే ముంచేస్తారు.. జాగ్రత్తగా ఉండాలి.అయితే వీరి గ్రహరీత్యా అనుకున్నది కచ్చితంగా సాధిస్తారు. సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి ఇంకా ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కూడా తెలుసుకుందాం.. తులా రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి చక్రంలో తులారాశి ఏడవది. తుల రాశికి చెందినవారు ఎత్తుకు పైఎత్తున […]

 Authored By aruna | The Telugu News | Updated on :29 August 2023,7:00 am

Zodiac Signs : 2023 సెప్టెంబర్ నెల తులా రాశి వారికి ఈ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. వీరిని ఈ సమయంలో నమ్మిన వారే ముంచేస్తారు.. జాగ్రత్తగా ఉండాలి.అయితే వీరి గ్రహరీత్యా అనుకున్నది కచ్చితంగా సాధిస్తారు. సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి ఇంకా ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కూడా తెలుసుకుందాం.. తులా రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి చక్రంలో తులారాశి ఏడవది. తుల రాశికి చెందినవారు ఎత్తుకు పైఎత్తున వేయడంలో ఎంతో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు.

తమ జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ఈ రాశులో జన్మించిన వారు తమ జీవితాన్ని ఎప్పుడూ కూడా స్పోటీ గా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్యసాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. తులా రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం ముఖ్యంగా మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి మంచి డబ్బులు పొదుపు చేస్తారు. అంతే కాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. ఉద్యోగం విషయంలో సెప్టెంబర్ నెలలో మీకు అద్భుతమైన సమయంగా కనిపిస్తుంది.

September Month Of Libra Zodiac Signs

Zodiac Signs : సెప్టెంబర్ నెలలో తులారాశి వారిని నమ్మిన వారే ముంచేస్తారు.. జాగ్రత్త…!

మీరు మీ పెండింగ్లో పెట్టిన అన్ని పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. ఇది ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలకు దారితీస్తుంది. మీ కెరియర్ లో ప్రమోషన్ లేదా అనుకున్న స్థానానికి బదిలీ లేదా అనుకున్న ఉద్యోగం లభించడం జరుగుతుంది. తుల రాశి వారికి కలిసొచ్చే రంగులు తెలుపు, ఆకుపచ్చ మరియు పసుపు ముఖ్యంగా పసుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించడం వల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక తుల రాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు మరియు నాలుగు వీరికి శుక్రవారం బుధవారం శనివారం కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టక పోవడమే మంచిది.

ఆపదలో ఉన్నవారికి వీలైనంత సాయం చేయండి. నల్ల సెనగలు ప్రసాదంగా ఇంకా నల్ల నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం పంచి పెట్టండి. చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరు బయట ప్రదేశాలలో చల్లండి. గోమాత సేవలో కొంత సమయం గడపండి. అంతేకాకుండా యువతలకు కొంత మేరకు ఉపకారం చేయడం వల్ల మరి ఆశీర్వాదం పొందండి. మీకు శుభ ఫలితాలు కచ్చితంగా కలుగుతాయి…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది