East godavari.. రన్నింగ్‌లోనే.. ఊడిన ఆర్టీసీ బస్సు చక్రాలు..
తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదం తప్పింది. జిల్లాలోని గోకవరం మండలం గుర్తేడుపాతకోటకు వెళ్లే ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు చక్రాలు రన్నింగ్‌లోనే ఊడిపోయాయి. ఒక్కసారిగా అలా టైర్లు ఊడిపోవడంతో డ్రైవర్ వెంటనే బస్సును కంట్రోల్‌లోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. అయితే, ప్రయాణికులెవరికీ ఏమి కాలేదు. ఎలాంటి నష్టం, గాయాలు జరగకుండా ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో డ్రైవర్, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే, బస్సు చక్రాలు ఊడిపోయినప్పుడు బస్సు వేగంగా వెళ్లడం లేదని, కొంచెం తక్కువ స్పీడ్‌లో ఉండటం వల్ల కంట్రోల్ చేయడం ఈజీ అయిందని బస్సులోని ప్రయాణికులు తెలిపారు. మెయింటెనెన్స్ ఇష్యూస్ వల్లే బస్సు చక్రాలు ఊడిపోయినట్లు స్థానికులు అంటున్నారు. అయితే, డిపోల్లో బస్సులు వెళ్లే ముందర రెగ్యులర్ చెకప్ సరిగా చేయకపోయి ఉండటం వల్ల ఇలా చక్రాలు ఊడిపోయాయని మరికొందరు అంటున్నారు. బస్సు చక్రాలు ఊడిపోవడం విషయమై ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే సురక్షిత ప్రయాణాలకు ప్రజలు ప్రజారవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీకే ప్రయారిటీ ఇస్తుండటం మనం చూడొచ్చు. ఇకపోతే ఆర్టీసీ బస్సులు గమ్యస్థానానికి ఇన్ టైంలో తీసుకెళ్తూ ఉంటాయి.