East godavari..అంధత్వ నివారణే లక్ష్యంగా కంటి వైద్య సేవలు: మంత్రి వేణుగోపాల కృష్ణ
ప్రజారోగ్యం బాధ్యతను సీఎం వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి తీసుకున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ అన్నారు. బుధవారం జిల్లాలోని రామచంద్రపురం పట్టణంలో వైద్యుల అందిస్తున్న ‘డాక్టర్ వైఎస్‌ఆర్ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ ప్రోగ్రాం ద్వారా అందిస్తున్న వైద్య సేవలను గురించి డాక్టర్స్‌ను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా మంత్రి కంటి వెలుగు కేంద్రానికి వెళ్లి వైద్యులతో మాట్లాడారు. అక్కడకు వచ్చిన పేషెంట్స్‌తోనూ మంత్రి గోపాల కృష్ణ ముచ్చటించారు.
వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రోగ్రాం ద్వారా రాష్ట్రంలో అంధత్వ నివారణ లక్ష్యంగా సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజారోగ్యం కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చిన సంగతిని మంత్రి గుర్తు చేశారు. వైసీపీ సర్కారు ప్రజల కోసం పని చేస్తున్నదని, ప్రజల క్షేమమే ప్రభుత్వ ప్రయారిటీ అని చెప్పారు. మంత్రి వేణుగోపాల కృష్ణ వెంట స్థానిక వైసీపీ నాయకులు, అధికారులు ఉన్నారు.