Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : బంగారం అనేది ఇప్పుడు విలువైన వస్తువు. ఒకప్పుడు బంగారం గురించి జనాలు పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. నేడు బంగారం అనేది స్టేటస్ కు సింబల్. ఎవరి వద్ద ఎంత ఎక్కువ బంగారం ఉంటే, ఎన్ని ఎక్కువ బంగారు ఆభరణాలు ఉంటే అంత గొప్పోళ్లు అన్నట్టుగా ఉంది నేటి సమాజం. అందుకే బంగారానికి నేడు అంత ఎక్కువ రేటు, అంత ఎక్కువ డిమాండ్. పెళ్లిళ్లు అయినా ఇతర శుభకార్యాలు అయినా బంగారానికి […]
Today Gold Rates : బంగారం అనేది ఇప్పుడు విలువైన వస్తువు. ఒకప్పుడు బంగారం గురించి జనాలు పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. నేడు బంగారం అనేది స్టేటస్ కు సింబల్. ఎవరి వద్ద ఎంత ఎక్కువ బంగారం ఉంటే, ఎన్ని ఎక్కువ బంగారు ఆభరణాలు ఉంటే అంత గొప్పోళ్లు అన్నట్టుగా ఉంది నేటి సమాజం. అందుకే బంగారానికి నేడు అంత ఎక్కువ రేటు, అంత ఎక్కువ డిమాండ్. పెళ్లిళ్లు అయినా ఇతర శుభకార్యాలు అయినా బంగారానికి ఉన్న డిమాండే వేరు. పెళ్లికూతురుకు కనీసం ఒక అరకిల బంగారం అయినా కొని మెడలో వేయాల్సిందే. ఒకప్పుడు బంగారాన్ని ఎక్కువగా మహిళలే ఆభరణాలుగా ధరించేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. చివరకు పురుషులు కూడా బంగారాన్ని ఆభరణాలుగా చేయించుకొని వేసుకుంటున్నారు. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు కూడా బంగారం ధరను రెట్టింపు చేశాయి. అందుకే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత వారం రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. మొన్న బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్న బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4700 ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.75 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.750 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామకు ఇవాళ రూ.5128 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.83 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,280 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.830 పెరిగింది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,440 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280 గా ఉంది. విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.57.70 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1.55 పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.577 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.15.50 పెరిగింది. కిలో వెండి ధర రూ.57,700 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.1550 పెరిగింది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.632 కాగా, కిలో వెండి ధర రూ.63200 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.577 కాగా, కిలో వెండి ధర రూ.57700 గా ఉంది.