7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దీపావళికి ముందే అకౌంట్ లో పడనున్న బకాయిలు
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. డీఏ బకాయిలను త్వరలోనే కేంద్రం.. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలో దీపావళి పండుగకు ముందే జమ చేయనుంది. అయితే.. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం కూడా తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏడో వేతన సంఘం బకాయిలకు సంబంధించిన ఐదో ఇన్ స్టాల్ మెంట్ ను దివాళీ కంటే ముందే రిలీజ్ చేసింది.
దీంతో దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. జనవరి 2017 నుంచి మార్చి 2017 వరకు ఉన్న బకాయలను ఐదో ఇన్ స్టాల్ మెంట్ గా చెల్లించనున్నారు. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం మొత్తం ఆరు ఇన్ స్టాల్ మెంట్స్ లో బకాయిలను చెల్లించాలని భావిస్తోంది. ఇప్పటికే నాలుగో ఇన్ స్టాల్ మెంట్ కు సంబంధించిన బకాయిలను రిలీజ్ చేయాలని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం డిసెంబర్ 2021 లోనే ఆర్డర్స్ జారీ చేసింది. తాజాగా ఐదో ఇన్ స్టాల్ మెంట్ కు సంబంధించిన బకాయిలను దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

7th Pay Commission on Good news for central government employees
7th Pay Commission : మొత్తం ఆరు ఇన్ స్టాల్ మెంట్స్ లో బకాయిలను చెల్లిస్తున్న ప్రభుత్వం
ఆర్థిక శాఖ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. దీపావళి కంటే ముందే అంటే.. జీతాలు పడటానికి ముందే ఉద్యోగులకు బకాయిలను తమ ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేయనున్నారు. దీని వల్ల 3.80 లక్షల మంది ఉద్యోగులకు లాభం చేకూరనుంది. అలాగే.. డీఏను కూడా 6 శాతానికి పెంచడం కోసం త్వరలోనే కేబినేట్ మీటింగ్ లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అక్టోబర్ 17 న కేబినేట్ మీటింగ్ జరగనుంది. ఇందులో డీఏతో పాటు హెచ్ఆర్ఏ పెంపుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు.