Ananya Nagalla : లిప్ సీన్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టిన అనన్య నాగళ్ళ…!
Ananya Nagalla : తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ళ…చేసిన మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కూడా సినిమాలలో మంచి మంచి ఆఫర్లు అందుకుంది. ఈ క్రమంలోనే పలు రకాల సినిమాల్లో నటించి మెప్పించింది. మల్లేశం సినిమా తర్వాత ప్లే బ్యాక్ , వకీల్ సాబ్ , మాస్ట్రో , మళ్లీ పెళ్లి వంటి సినిమాల్లో నటించి మంచి […]
ప్రధానాంశాలు:
Ananya Nagalla : లిప్ సీన్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టిన అనన్య నాగళ్ళ...!
Ananya Nagalla : తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ళ…చేసిన మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కూడా సినిమాలలో మంచి మంచి ఆఫర్లు అందుకుంది. ఈ క్రమంలోనే పలు రకాల సినిమాల్లో నటించి మెప్పించింది. మల్లేశం సినిమా తర్వాత ప్లే బ్యాక్ , వకీల్ సాబ్ , మాస్ట్రో , మళ్లీ పెళ్లి వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సాధించుకుంది. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో మాత్రం అనన్య నాగళ్లకు మంచి పాపులారిటీ దక్కిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో తన నటనతో సత్తా చాటిన అనన్య ఇప్పుడు మరో రెండు సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది.ఇక ఇప్పుడు అనన్య నాగళ్ల ” తంత్ర ” అనే హర్రర్ సినిమాతో పాటు ” పొట్టేలు ” అనే మరో సినిమాలో కూడా నటించబోతోంది.
అయితే తాజాగా అనన్య నటించిన పొట్టేలు సినిమాలో ఒక లిప్ కిస్ సన్నివేశాలు విడుదల కావడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో తాజాగా జరిగిన ” తంత్రా ” ట్రైలర్ లాంచ్ లో కూడా పొట్టేలు సినిమా లోని ముద్దు సీన్స్ గురించి ఆసక్తికరమైన ప్రశ్నలు అనన్యకు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే కొందరు తంత్ర సినిమాలో కూడా ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయా అని అడుగగా దానికి అనన్య నాగళ్ళ సమాధానం ఇస్తూ పొట్టేలు సినిమాలో ఆ ముద్దు సన్నివేశం అనేది చాలా అవసరం అందుకే చేయాల్సి వచ్చింది. ఇక ఈ సినిమాలో గ్లామర్ రొమాన్స్ హర్రర్ తో పాటు అన్ని ఉంటాయని వివరించింది.
అదేవిధంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రతి మనిషిలో ఆలోచన అనేది మారుతూ ఉంటుంది. మార్పు అనేది లేకపోతే మనం ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. అదేవిధంగా నా కెరియర్ ప్రారంభించిన దశలో నేను ఎలా ఉన్నా సరే మంచి పాత్రలు నా దగ్గరికి వస్తాయని భావించా….దానికి తగినట్లు నా నటనతో ఆకట్టుకుంటే చాలని అనుకునే దానిని కానీ నటన అంటే కొన్నిసార్లు ఇలాంటి సన్నివేశాలు కూడా చేయాల్సి వస్తుందని.. అది అర్థం చేసుకోవడానికి నాకు కాస్త టైం పట్టిందంటూ ఈ సందర్భంగా అనన్య చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే కథ డిమాండ్ చేస్తే ఎటువంటి పాత్రలో అయిన చేయడానికి తాన సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది.