Brahmamudi Serial Today April 12th Episode : రాజ్ అడిగిన సూటి ప్రశ్నకు కావ్య సమాధానం.. రుద్రాణిని తిట్టిన ధాన్యలక్ష్మి
ప్రధానాంశాలు:
Brahmamudi Serial : రాజ్ అడిగిన సూటి ప్రశ్నకు కావ్య సమాధానం.. రుద్రాణిని తిట్టిన ధాన్యలక్ష్మి
Brahmamudi Serial Today April 12th Episode : స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్స్‌తో కొనసాగుతున్న బ్రహ్మముడి సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రాజ్ స్వరాజ్ గ్రూప్ కంపెనీ దగ్గర కావ్యను కలిసి ఆమెకు బొకే ఇచ్చి ఆశ్చర్యపరుస్తాడు. ఆ తర్వాత ఆమెను పలు ప్రశ్నలు అడుగుతూ కళావతి గారు మీరు నాకు ముందే తెలుసా? ఎందుకంటే మిమ్మల్ని ఇంతకుముందే కలిసినట్టు అనిపిస్తుంది అంటాడు రాజ్. ఆ మాటకు కావ్య సమాధానం చెప్పకుండా కావ్య అక్కడినుండి వెళ్తుంది. Brahmamudi Today Serial
Brahmamudi Serial Today April 12th Episode : రాజ్ అడిగిన సూటి ప్రశ్నకు కావ్య సమాధానం.. రుద్రాణిని తిట్టిన ధాన్యలక్ష్మి
బయట రాజ్ కనిపించకపోయే సరికి యామిని రాజ్‌ను వెతుకుంటూ ఆఫీస్ లోకి వెళ్లిపోతుంది. అప్పుడే బయట యామిని కారు చూసి రాజ్ ఆమెకు ఫోన్ చేస్తాడు. ఏంటి ఇక్కడ ఉన్నావ్ అంటే చిన్న పని మీద ఆఫీసుకు వచ్చాను అని చెప్పగా సరే నేను ఇంటికి వెళ్తున్నా అని చెప్పి రాజ్ వెళ్లిపోతాడు.
దుగ్గిరాల ఇంట్లో అపర్ణ పుట్టినరోజు అని.. అన్నదానం చేయాలని ధాన్యలక్ష్మి, ప్రకాశం అంటే.. అక్కడే ఉన్న రుద్రాణి మాత్రం రాజ్ చచ్చిపోయాక అపర్ణ వదిన ఎలా పుట్టినరోజు చేసుకుంటుంది? రాజ్ ఉంటే తనే దగ్గర ఉండి చేసేవాడని రుద్రాణి అంటుంది. ఆమె మాటలు విన్న అపర్ణ కొడుకు లేనప్పుడు ఈ పుట్టినరోజులు ఎందుకని అనుకుంటుంది. అలా ఫీల్ అయ్యి ఏడుస్తూ లోపలి వెళ్లిపోతుంది. దాంతో నీకు అసలు మనసాక్షే లేదు రుద్రాణి. కొడుకు పోయి బాధ పడుతుంటే నువ్వు మాత్రం ఇంకా ఏడిపిస్తున్నావ్ అని ధాన్యలక్ష్మి తిడుతుంది. ఏంటీ బ్రతికున్న మనుషులను పీక్కుతినే నువ్వు కూడా మనసాక్షి గురించి మాట్లాడుతున్నావా అని ధాన్యలక్ష్మిపై రుద్రాణి సెటైర్ వేస్తుంది. దానికి నేఅంతా కాదులే అంటూ కవర్ చేసుకుంటుంది ధాన్యలక్ష్మి.
ఇక మరోవైపు కావ్యను ఆఫీస్ లో కలిసిన కొందరు.. 2 కోట్ల రూపాయిలు పెండింగ్ ఉందని అంటే మ్యానేజర్ ను పిలిచి కావ్య అడుగుతుంది. దానికి అతను సమాధానమిస్తూ అవును మనకు వచ్చే పేమెంట్స్ రాలేదు అందుకే హోల్డ్ పడ్డాయి అనగా, చెప్పాలి కదా అని కావ్య అరుస్తుంది. ఇంతటితో నేటి ఎపిసోడ్ పూర్తవుతుంది.