ఆయనే పెట్టుకున్నాడు.. ఐకాన్ స్టార్‌పై బన్నీ పరువుదీసిన దిల్ రాజు
Dil Raju : ఇండస్ట్రీలో హీరోలకు ఆ స్టార్ ఈ స్టార్ అనే బిరుదులుంటాయి. అవి ఒకప్పుడు అయితే అభిమానులు ప్రేమగా ఇచ్చేవారు. లేదంటే ఇండస్ట్రీ ఇచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఎవరికి వారే పెట్టేసుకుంటున్నారు. అలా ఇప్పుడు అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ బాగా చర్చల్లోకి వచ్చింది. బన్నీని అందరూ స్టైలీష్ స్టార్‌గానే అభివర్ణిస్తుంటారు. అదే బన్నీకి సూట్ అయింది కూడా. కానీ మధ్యలో ఐకాన్ స్టార్ అనే ట్యాగ్‌ను తగిలించుకున్నాడు. పుష్ప సినిమాతోనే ఐకాన్ స్టార్ అని పిలిపించుకుంటున్నాడు.
అసలే ఐకాన్ అనే టైటిల్‌తో దిల్ రాజు నిర్మాతగా బన్నీ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా రావాల్సి ఉంది. అలా ఈ మూవీ అయిన తరువాత ఐకాన్ స్టార్ అని పెట్టుకున్నా బాగానే ఉండేది. కానీ సుకుమార్ ఇచ్చాడు పెట్టాడు అంటూ బన్నీ తనని తాను ఐకాన్ స్టార్ అని ముద్ర వేసుకుంటున్నాడు. అయితే ఈ విషయంలో బన్నీ మీద కొందరు సెటైర్లు వేస్తున్నారు. తాజాగా దిల్ రాజు కూడా ఓ కౌంటర్ వేశాడు. ఐకాన్ స్టార్ అని ఎవ్వరూ ఇవ్వలేదని అందరూ ముందే గాలి తీసేశాడు.
Dil Raju : ఐకాన్ స్టార్‌పై బన్నీ పరువుదీసిన దిల్ రాజు
ఐకాన్ సినిమా అప్డేట్ గురించి దిల్ రాజు మాట్లాడుతూ.. కథ చాలా మంచిది. మా అందరికీ నచ్చింది. కొన్ని కారణాల వల్ల అటూ ఇటూ అవుతోంది. అంతే తప్పా.. సినిమా కచ్చితంగా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఐకాన్ స్టార్ అని పెట్టుకోవడంపై దిల్ రాజు కౌంటర్ వేశాడు. ఆయనకు ఆయనే పెట్టుకున్నాడు.. మేం ఇవ్వలేదు అంటూ దిల్ రాజు కౌంటర్ వేస్తూ నవ్వేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్లు తెగ వైరల్ అవుతోన్నాయి.