Sudigali Sudheer : అగ్ని పరీక్షలే.. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ నిజాలు బయటపెడతారా?
Sudigali Sudheer : హైపర్ ఆది మెగా అభిమాని అని అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఎక్కువగా పవన్ కళ్యాణ్‌ను ఆరాధిస్తుంటాడు. జన సేన తరుపున కూడా ఆది ప్రచారం చేశాడు. ఇక సుధీర్ అయితే ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాలు, షోలు అంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. అయితే ఈ ఇద్దరికి తాజాగా ఆడియెన్స్ నుంచి అదిరిపోయే ప్రశ్నలు ఎదురయ్యాయి.వచ్చే వారం శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో స్పెషల్ థీమ్‌ను ఎంచుకున్నారు. అఆ సినిమా టైపు.. అ అంటే అమ్మాయి, ఆ అంటే ఆంటీ అంటూ.. ఓ థీమ్ మీద ఎపిసోడ్ ప్లాన్ చేశారు.
అమ్మాయిలు వర్సెస్ ఆంటీలు అని పెట్టారు. దీంతో సీరియల్ నటీనటులు, షోలో వచ్చే యాంకర్లు, ఆర్టిస్టుల మధ్య పోటీ పెట్టారు. అయితే ఇందులో చివర్లోనే అదిరిపోయే ట్విస్టులు పెట్టారు. దాంట్లో పంచ్ ప్రసాద్, పరదేశీ, ఆది, సుధీర్‌లకు ఆడియెన్స్ నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి.పంచ్ ప్రసాద్ కోసం ఓ అభిమాని కిడ్నీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. అది చూసి పంచ్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు.మీ అందరినీ నవ్వించేందుకు ఇంకొంత కాలం టైం ఇవ్వమని దేవుడిని కోరుకుంటాను అని కంటతడి పెట్టేశాడు.

Hyper Aadi And Sudigali Sudheer Faces Questions In Sridevi Drama Company
ఇక పరదేశీకి తన వైజాగ్ ఘటనకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఆ సమయంలో తన అమ్మ పరిస్థితి ఏంటో చెప్పాడు. అయితే ఆది, సుధీర్‌లకు మాత్రం ఇరుకున పెట్టే ప్రశ్నలు వచ్చాయి.మొదటి నుంచి కూడా నువ్ పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పుకుంటూనే ఉన్నావ్.. దాని వల్ల మిగతా వాళ్లు ఆఫర్లు ఇవ్వకుండా ఉన్నారా? అని ఆదిని ప్రశ్నించారు. ఢీ షోను ఎందుకు వదిలి పెట్టావ్ అని సుధీర్‌ను అడిగారు. మరీ వీటికి ఈ ఇద్దరూ సమాధానాలు చెబుతారా? లేదా? అన్నది చూడాలి.
