Hyper Aadi : దుమ్ములేపేపిన ఆది.. ముద్దులిస్తూ రెచ్చిపోయిన పూర్ణ
Hyper Aadi : హైపర్ ఆది, ప్రియమణిలు బుల్లితెరపై చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. బావ అంటూ ఆదిని ఆటపట్టిస్తుంటుంది ప్రియమణి. హగ్గులు, ముద్దులతోనూ దుమ్ములేపుతుంటారు. ఇక స్కిట్లలో అయితే ఈ ఇద్దరూ జీవిస్తారు. ఆది ఏంటి? బావ ఏంటి? ప్రియమణి అలా పిలవడం ఏంటి?అని జనాలు నెత్తి నోరు కొట్టుకున్నా కూడా వారు వినరు. అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇక ఈ ఇద్దరూ ఇలా ఉంటే.. మధ్యలో పూర్ణది మరో గోల. ముద్దులు, హగ్గులు బుగ్గ కొరకడం వంటివి చేస్తుంటుంది.

Hyper Aadi Dance In Dhee Priyamani Poorna
అయితే ఆది ఈ మధ్య తనలోని ఇతర టాలెంట్లీను చూపించేస్తున్నాడు. మొన్నో ఈవెంట్‌లో పాట పాడేశాడు. ఇక డ్యాన్సులు కూడా వేస్తున్నాడు.అయితే ఆది రెగ్యులర్ స్టెప్పులు ఉంటాయి. ఎప్పుడూ అవే వేసి నవ్విస్తుంటాడు. కానీ ఈసారి మాత్రం అదరగొట్టేశాడు ఆది. తాజాగా వదిలిన ప్రోమోలో ఆది తన డ్యాన్సులతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. చిరంజీవిలా స్టెప్పులు వేశాడు. ఆయన మాస్ పాటకు ఆది కాలు కదిపాడు. అందరివాడు పాటకు హైపర్ ఆది వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అయ్యారు.
Hyper Aadi : ఆది డ్యాన్సులు.. పూర్ణ ముద్దులు

Hyper Aadi Dance In Dhee Priyamani Poorna
మొత్తానికి ఆది కూడా మంచి డ్యాన్సర్ అని నిరూపించుకున్నాడు. చిన్న స్టెప్పులే అయినా కూడా మంచి గ్రేసుతో చేశాడు. అది చూసి ప్రియమణి ఫిదా అయింది. ఫెంటాస్టిక్ అంటూ ప్రశంసలు కురిపించింది. ప్రియమణి అంతటితో ఆగిపోతే.. పూర్ణ మాత్రం ఇంకాస్త ముందుకు వెళ్లింది. గాల్లోనే ముద్దులిస్తూ పూర్ణ నానా హంగామా చేసింది. అలా ప్రియమణి, పూర్ణల రియాక్షన్, ఆది స్టెప్పులు ప్రోమోలో వైరల్ అవుతున్నాయి. అలా ఆది తన ప్రతిభను బయటపెట్టేశాడు.
