Jabardasth : వాడు మా ఇంటి చుట్టే తిరుగుతాడు!.. జబర్దస్త్ ఫైమా కామెంట్స్ వైరల్
Jabardasth : బుల్లితెరపై ఫైమా ఎదుగుతున్న తీరు అందరికీ తెలిసిందే. పటాస్ షో నుంచి జబర్దస్త్ షో వరకు ఆమె ప్రయాణంలో ఎన్నో మలుపులున్నాయి. ఇక ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, రెచ్చిపోదాం బ్రదర్ వంటి షోలతో ఫైమా దుమ్ములేపుతోంది. అయితే ఫైమా, కమెడియన్ ప్రవీణ్ మధ్య ప్రేమాయణం ఉందనే గుసగుసలు వినిపిస్తుంటాయి
తాజాగా నూకరాజు దెబ్బకు ఫైమా ప్రవీణ్ వ్యవహారం బయటకు వచ్చింది. తాజాగా రెచ్చిపోదాం బ్రదర్ షోలో ఫైమాను నూకరాజు దారుణంగా ఏడిపించాడు. లేడీ గెటప్పులో ఉన్న నూకరాజు ఫైమాను ఓ రేంజ్‌లో సెటైర్లతో ఆడుకున్నాడు. ఇంతకీ నేను ఎలా ఉన్నాను. బాపు గారి బొమ్మలా ఉన్నానా? అని ఫైమా తన అందం గురించి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటుంది.

Jabardasth Faima On Patas Praveen Love Story
Jabardasth : ప్రవీణ్ ఫైమా ప్రేమ కథ..
బాపుగారి బొమ్మలా కాదు పొలం పెట్టే దిష్టి బొమ్లా ఉన్నావ్ అని కౌంటర్ల వేస్తాడు. అయినా నా అందం గురించి మీకు తెలియదే.. రోజు మా ఇంటి ముందు ప్రవీణ్ వచ్చి విజిల్ వేస్తాడు.. అని ఫైమా అసలు విషయం చెప్పేసింది. అయ్యో వాడు చెత్తోడే.. నిన్ను చూసి చెత్త అనుకున్నాడేమో అని నూకరాజు పరువుతీసేస్తాడు. మొత్తానికి ప్రవీణ్ మాత్రం ఫైమా ఇంటి చుట్టూ తిరుగుతాడన్న మాట.
