Jabardasth Vinod : గుర్తుపట్టలేకుండా మారిపోయిన జబర్దస్త్ వినోద్ .. చేతబడి చేశారంటూ ఆరోపణ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardasth Vinod : గుర్తుపట్టలేకుండా మారిపోయిన జబర్దస్త్ వినోద్ .. చేతబడి చేశారంటూ ఆరోపణ..!

 Authored By aruna | The Telugu News | Updated on :17 November 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Jabardasth Vinod : గుర్తుపట్టలేకుండా మారిపోయిన జబర్దస్త్ వినోద్ ..

  •   చేతబడి చేశారంటూ ఆరోపణ..!

Jabardasth Vinod : బుల్లితెర మోస్ట్ పాపులర్ షాప్ జబర్దస్త్ షో ద్వారా చాలామంది కమెడియన్స్ ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు. వీరిలో చాలామంది సినిమాలోకి వచ్చారు. ప్రస్తుతం జబర్దస్త్ లో చాలా మార్పులు జరిగాయి. ప్రారంభంలో ఉన్న కమెడియన్స్ ఇప్పుడు జబర్దస్త్ లో లేరు. ఒకప్పుడు జబర్దస్త్ లో ఆడవాళ్ళ పాత్ర కోసం మగవాళ్లే గెటప్ వేసుకుని చేసేవారు. అలా పరిచయమైన వారిలో జబర్దస్త్ వినోద్ ఒకరు. చీర కట్టులో అచ్చంగా అమ్మాయిలాగా కనిపించిన వినోద్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రారంభంలో వినోద్ ని చూసినవారు అమ్మాయే అనుకున్నారు అంత అందంగా ఉండేవాడు అతను.

లేడీ గెటప్ లో జబర్దస్త్ ను అలరించిన వినోద్ ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారాడు. అందుకు గల కారణాలను వివరించాడు. గత కొంతకాలంగా వినోద్ తెరమీద కనిపించడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వివరాలు వెల్లడించాడు. కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యానని, అంతేకాక తనకు ఎవరో చేతబడి చేశారని అనుమానం కూడా కలిగిందని చెప్పుకొచ్చాడు. హాస్పిటల్ ఖర్చు, చేతబడి విరుగుడు మొత్తం మూడు లక్షల వరకు ఖర్చు అయిందని తెలిపాడు. తన పరిస్థితి తెలుసుకొని అడగక ముందే తోటి నటులు వచ్చి సహాయం చేశారని వివరించాడు.

వారంతట వారే వచ్చి తనకి సహాయం చేయడం చూసి ఎంతో సంతోషించానని అన్నాడు. ఇక గతంలో ఇంటి ఓనర్ తో గొడవ అయిన సమయంలో తన చేయి విరిగిందని ఇంటికి హామీ ఇవ్వడంతో ఐదు లక్షల వరకు నష్టపోవాల్సి వచ్చిందని చెప్పాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడిందని, అంతా సెట్ అయిన తర్వాత జబర్దస్త్లోకి వెళతానని ఇతర ఈవెంట్స్ కూడా చేస్తానని చెప్పుకొచ్చాడు. అయితే తన మీద ఎవరో చేతబడి చేశారని వినోద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. అమ్మాయిలే అసూయ పడేంత అందంగా రెడీ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకునే వాడు వినోద్. ఇక ప్రస్తుతం వినోద్ త్వరగా కోలుకొని జబర్దస్త్ లోకి రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది