Jr NTR – Amit Shah : ఎన్టీఆర్, అమిత్ షా భేటీ వెనుక రాజమౌళి ఉన్నాడా.. అసలేం జరుగుతోంది?
Jr NTR – Amit Shah : మునుగోడు లో మీటింగ్ కోసం అంటూ తెలంగాణ కు వచ్చిన కేంద్ర హోం మంత్రి.. బీజేపీ అగ్ర నేత అమిత్ షా నిన్న రాత్రి సమయంలో ఎన్టీఆర్ ను కలవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అవ్వబోతున్నాడు అంటూ వార్తలు వచ్చినప్పటి నుండి కూడా ఎందుకు ఎందుకు అంటూ ఒకటే చర్చ. మొత్తం సినిమా ఇండస్ట్రీ తో పాటు రాజకీయ వర్గాల వారు మరియు మీడియా సామాన్య జనాలు ఇలా అంతా కూడా అమిత్ షా ఎందుకు ఎన్టీఆర్ ని కలవాలి అనుకున్నాడు. అసలు ఇద్దరి మధ్య భేటీకి కారణం ఏంటీ అంటూ చర్చించుకోవడం కనిపించింది.
ఈ సమయంలోనే ఎన్టీఆర్ మరియు అమిత్ షా భేటీ అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా లో అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను ఎన్టీఆర్ ను అమిత్ షా కలిశాడు అంటూ బీజేపీ నాయకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో ఇటీవల రాజ్యసభ సభ్యత్వం దక్కించుకున్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్వయంగా ఈ భేటీ వెనుక ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అమిత్ షా కి మరియు ఎన్టీఆర్ కి మధ్య వారదిగా పని చేసింది రాజమౌళి అని మరియు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మునుగోడు సభకు అమిత్ షా హాజరు అవ్వడం వల్ల పెద్దగా వచ్చిందేమి లేదు. కాని ఎన్టీఆర్ తో భేటీ అంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడం వల్ల తెలంగాణలో బీజేపీకి అనూహ్యంగా పట్టు సారించినట్లు అయ్యింది. అలాగే మునుగోడు సభ కూడా సూపర్ సక్సెస్ అన్నట్లుగా టాక్ వచ్చింది. రాజకీయ వ్యూహం లో భాగంగానే అమిత్ షా స్వయంగా ఎన్టీఆర్ ని కలిశాడు అంటూ కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి లాగేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తనకి రాజ్యసభ సీటు ఇచ్చినందుకు గాను ఇలా రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడేమో అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి