Karthika Deepam 10 June Today Episode : జ్వాల చేతి మీద ఉన్న హెచ్ టాటూను చూసి శోభ షాక్.. జ్వాలే శౌర్య అని తెలుస్తుందా? హిమ ఏం చేస్తుంది?
Karthika Deepam 10 June Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 జూన్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 1375 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హిమకు క్యాన్సర్ అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతాడు నిరుపమ్. తనకు క్యాన్సర్ అని చెప్పి ఎంగేజ్ మెంట్ ను క్యాన్సిల్ చేసుకుంది అని అనుకుంటాడు నిరుపమ్. తనకు ఏం కాదు. నేను తనను రక్షించుకుంటాను. ముందే చెప్పి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. పాపం హిమ.. అందరి ముందు దోషిలా నిలబడింది కదా అని అనుకుంటాడు నిరుపమ్. మరోవైపు జ్యోతిష్కుడిని ఆటోలో దించుతుంది జ్వాల. తనకు డబ్బులు ఇచ్చేటప్పుడు చేయి చూసిచ జ్యోతిష్కుడు ఆశ్చర్యపోతాడు. నీతి మామూలు జాతకం కాదు అంటాడు. ఇంతలో అక్కడికి శోభ వచ్చి తన చేతిని చూస్తుంది. చివరికి నీ లైఫ్ జాతకం చెప్పించుకునే వరకు వచ్చిందన్నమాట అంటుంది శోభ.

karthika deepam 10 june 2022 full episode
ఎందుకు జ్వాల నువ్వు అంత కోపంగా ఉంటావు. అందరినీ ప్రేమించడం నేర్చుకో అని సలహా ఇస్తుంది శోభ. నిజానికి నువ్వు పెద్దగా చదువుకోలేదు కదా అంటుంది శోభ. దీంతో ప్రేమించడానికి పుస్తకాలతో పనేంటి. దిల్ ఉంటే చాలు అంటుంది జ్వాల. నీ జాతకం నేను చెప్పనా. నీకు ఐశ్వర్యం నిల్. లవ్ లైన్.. లైఫ్ లైన్ నిల్ అంటుంది. నువ్వు ఒకటి అనుకుంటే జరిగేది ఇంకొకటి అంటుంది. దీంతో జ్యోతిష్కుడు జ్వాల చేయిని తీసుకొని అమ్మాయి జాతకం ఇంత అద్భుతంగా ఉంటే మీరేంటి తిరగేసి చెబుతున్నారు అంటాడు. ఐశ్వర్యం ఉంది.. ప్రేమ గీత కూడా ఉంది కానీ.. కొన్ని ఇబ్బందులు మాత్రం తప్పవు అంటాడు జోగారావు. నీ జాతకంలో భాగ్యరేఖ జెర్రిపోతులా ఉంది. అది నీ జాతకాన్నే మార్చేస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు జోగారావు.
అతడు చెప్పిన మాటలు వింటుంటే నీకు కడుపు మండుతున్నట్టుంది అంటుంది జ్వాల. దీంతో అవన్నీ ఉత్తివే అంటుంది శోభ. దీంతో అవన్నీ నేను నిజం చేస్తాను అంటుంది జ్వాల. ఇలా రోడ్ల మీద తిరగడం మానేసి.. వెళ్లి డాక్టర్ వి డాక్టర్ గా ఉండు అంటుంది జ్వాల.
నీ సంగతే నాకు అర్థం కావడం లేదు. నువ్వు డాక్టర్లతో నీ ఫ్రెండ్ షిప్.. ఆ తింగరికి నీ మీద అంత ఇంట్రెస్ట్ ఏంటో అర్థం కాదు అంటుంది శోభ. నువ్వు ఏం చేయలేవు అని అంటుంది జ్వాల. ఇంతలో తన చేతి మీద హెచ్ అని రాసి ఉన్న అక్షరాన్ని చూస్తుంది.
నీ పేరు జ్వాల కదా.. జే అని ఉండాలి కదా అంటుంది. దీంతో నా చేయి నా ఇష్టం అంటుంది. దీంతో ఇది నీ పేరు కాకపోతే నీ లవర్ పేరు మొదటి అక్షరమా అంటుంది. దీంతో లవర్ అయితే దిల్ లో ఉంటాడు అంటుంది. మరి అదేంటో అంటే.. నా శత్రువు అంటుంది జ్వాల.
Karthika Deepam 10 June Today Episode : జ్వాలకు హిమ గురించి చెప్పేయాలని అనుకున్న నిరుపమ్
శత్రువు పేరు చేతి మీద పచ్చబొట్టా.. ఇదేంటి నేనెప్పుడూ చూడలేదు.. అంటుంది శోభ. నీకెందుకు అంటుంది జ్వాల. మరోవైపు నిరుపమ్.. హిమ మీద ఉన్న ప్రేమ విషయాన్ని జ్వాలకు చెప్పాలని అనుకుంటాడు. హిమ మనసు జ్వాల మాత్రమే మార్చగలదు అనుకున్నాను కానీ.. ఇప్పుడు హిమకు క్యాన్సర్ అని తెలిసింది. జ్వాలకు చెప్పకుండా ఎలా ఉంటాను అని అనుకుంటాడు. ఏంటి డాక్టర్ సాబ్.. ఇంతలా ఆలోచిస్తున్నారు అని అంటుంది.
తనకు ఏదో చెబుదామనుకుంటాడు కానీ.. మీ మనసుకు ఏది తోస్తే.. ఏది చేయాలనిపిస్తే అది చేయండి అని సలహా ఇస్తుంది జ్వాల. దీంతో అవును.. నిజం.. నేను నాకు ఏం చేయాలనిపిస్తే అది చేస్తా. అందుకే జ్వాలకు హిమ గురించి విషయాలు కూడా చెప్పను అని అనుకుంటాడు నిరుపమ్.
ఇంతలో సౌందర్య నిరుపమ్ కు ఫోన్ చేస్తుంది. కట్ చేస్తే హిమ దీనంగా కూర్చొని ఉంటుంది. తనను చూసి బాధపడుతూ ఉంటారు సౌందర్య, ఆనంద రావు. అది ఎందుకు పెళ్లి వద్దన్నదో ఇప్పుడు అర్థం అయింది. తనకు క్యాన్సర్ అని తెలిశాక ఏం మాట్లాడగలం చెప్పండి. జరగకూడని వన్నీ ఈ ఇంట్లోనే జరుగుతున్నాయి అంటుంది సౌందర్య.
అనవసరంగా ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి అంటుంది సౌందర్య. మరోవైపు నిరుపమ్.. తన అమ్మానాన్న అందరినీ సౌందర్య ఇంటికి పిలుస్తాడు. ఈ రోజు నుంచి హిమకు అన్ని సేవలు నేనే చేస్తా అంటాడు. అది కూడా ఒక భర్తలా అంటాడు.
ఒక డాక్టర్ గా కాదు.. ఒక బావ గా కాదు.. అనే సరికి అందరూ షాక్ అవుతారు. స్వప్నకు చిరాకు వస్తుంది. కానీ.. ఎవ్వరి మాటా వినడు నిరుపమ్. శౌర్యకు, నిరుపమ్ కు పెళ్లి చేయాలని అనుకుంటే.. నిరుపమ్ ఏంటి ఇలా చేస్తున్నాడు అని అనుకుంటుంది హిమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.