Punch Prasad : ఎప్పుడు నవ్వించే పంచ్ ప్రసాద్ ఈసారి ఏడిపించాడు భయ్యా..!
Punch Prasad : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపిస్తున్నాడు. ఈమద్య ఆయన శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్న జాతి రత్నాలు షో లో కూడా కనిపిస్తున్నాడు. ప్రతి దానిపై కూడా పంచ్ వేయడం ఆయన స్పెషాలిటీ. అది నవ్వు తెప్పించేది కాకున్నా కూడా అది ఆయన వేసిన తీరు తో నవ్వు తెప్పిస్తుంది. కమెడియన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న పంచ్ ప్రసాద్ ఆరోగ్యం గురించి అందరికి తెల్సిందే.ఆయన రెండు ఊపిరితిత్తులు ఫెయిల్ అయ్యాయి. ఆయనకు త్వరలో భార్య ఊపిరితిత్తుల్లో ఒక దాన్ని ఆపరేషన్ చేసి అమర్చబోతున్నారు.
ఆయన ఈ విషయాన్ని పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. త్వరలో ఆపరేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. తన భార్య తనకు మళ్లీ జీవితంను ఇవ్వబోతుంది… తన ప్రాణం ను కాపాడబోతుంది అంటూ ఆయన పలు వేడుకల సందర్బంగా చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఆయన చాలా ఫన్నీగా చెప్పి అందరిని నవ్వించాడు. కాని ఈసారి మాత్రం ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు.వచ్చే ఆదివారం టెలికాస్ట్ కాబోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కి సంబంధించిన ప్రమోను విడుదల చేశారు. ఆ ప్రోమోలో కొందరు సెలబ్రెటీలకు సంబంధించిన అభిమానులు ప్రశ్నలు అడగడం జరిగింది.

Punch Prasad emotional speech in Sridevi Drama Company
ఆ ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో పంచ్ ప్రసాద్ యొక్క అభిమాని స్పందిస్తూ కుదిరితే తన కిడ్నీ ఇస్తాను అంటూ వ్యాఖ్యలు చేశాడు. దాంతో పంచ్ ప్రసాద్ నా కామెడీకి నవ్వుతున్నారు అని తెలుసు కాని.. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారని.. అభిమానిస్తున్నారని తెలియదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పంచ్ ప్రసాద్ ఎమోషనల్ అవ్వడంతో అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. నవ్వించడం మాత్రమే కాదు పంచ్ ప్రసాద్ ఈసారి ఏడిపించాడు.
