Ram Charan : రామ్ చ‌ర‌ణ్ ఇంట్లో స‌ల్మాన్ ఖాన్, వెంక‌టేష్‌కి ఏం పని?

Ram Charan: బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఇటీవ‌ల టాలీవుడ్‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇక్కడి వారితో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదే అదనుగా ఆయన్ని వాడుకోవాలని తెలుగు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇలా ఒకరికొకరు మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో సహరించుకుంటున్నారు. గాఢ్ ఫాదర్ లో చిరంజీవి సల్మాన్ ను వాడితే, మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. సల్మాన్ ఖాన్ బాకీ తీర్చేశారు. ఆయ‌న సినిమాలో చర‌ణ్ కీ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు. అలాగే ‘కభీ ఈద్ కభీ దివాళీ’ సినిమాలో ‘వెంకటేశ్’ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు.

Advertisement

ఇటీవలే ‘కమల్ హాసన్’ నటించిన ‘విక్రమ్’ సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో చిరంజీవి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో కమల్ తో పాటు సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు. అటు టాలీవుడ్ ఇటు కోలీవుడ్ సెలబ్రెటీలతో సల్లూ చేస్తున్న హంగామా చూసిన ఆయన అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌ ప్రస్తుతం `కభీ ఈద్‌ కబీ దివాళీ` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో వెంకటేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
ram charan invites to Salman Khan and Venkatesh
ram charan invites to Salman Khan and Venkatesh

Ram Charan : స‌ల్మాన్ జోరు..

ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో సల్మాన్‌,వెంకీ,పూజా పాల్గొంటున్నారు. కాస్త టైం దొర‌క‌డంతో వీరందా క‌లిసిసి రామ్ చ‌ర‌ణ్ ఇంట్లో పార్టీ చేసుకున్న‌ట్టు తెలుస్తుంది. సల్మాన్‌, చరణ్‌ మంచి స్నేహితులు, వీరి మధ్య మంచి రిలేషన్‌ ఉంది. వెంకీ, సల్మాన్‌ కూడా స్నేహితులనే విషయం తెలిసిందే. చాలా సందర్భాల్లో వీరు కలుసుకున్నారు.ఆ ఫ్రెండ్స్ షిప్‌తోనే సల్మాన్‌ సినిమాలో వెంకీ నటిస్తున్నట్టు తెలుస్తుంది. సల్మాన్‌ తన `కబీ ఈద్‌ కభీ దివాళీ` చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయాలని భావిస్తున్నారట. అందుకే తెలుగు స్టార్లని తన సినిమాలో నటింప చేస్తున్నట్టు సమాచారం.

Advertisement