Shivani Rajashekar : మా నాన్న మీకేం అన్యాయం చేశాడు ‘ .. అల్లు అరవింద్ ని స్టేజ్ మీదే నిలదీసిన శివాని రాజశేఖర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shivani Rajashekar : మా నాన్న మీకేం అన్యాయం చేశాడు ‘ .. అల్లు అరవింద్ ని స్టేజ్ మీదే నిలదీసిన శివాని రాజశేఖర్..!

 Authored By aruna | The Telugu News | Updated on :21 November 2023,8:16 pm

ప్రధానాంశాలు:

  •  Shivani Rajashekar : మా నాన్న మీకేం అన్యాయం చేశాడు ' ..

  •  అల్లు అరవింద్ ని స్టేజ్ మీదే నిలదీసిన శివాని రాజశేఖర్..!

Shivani Rajashekar : జీవిత రాజశేఖర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే చిన్న కుమార్తె శివాని రాజశేఖర్ తాజాగా ‘ కోటబొమ్మాళి ‘ సినిమాలో నటించారు. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాహుల్ విజయ్ హీరోగా తేజ మార్ని తెరకెక్కించిన కోటబొమ్మాళి పీఎస్ సినిమాలో శ్రీకాంత్ , వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాస్, విద్య కొప్పినీడి సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా నవంబర్ 24న గ్రాండ్గా థియేటర్లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాదులో గ్రాండ్గా జరిగింది.

ఈ సందర్భంగా హీరోయిన్ శివాని రాజశేఖర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొదటగా ధీరజ్ గారు నాకు కాల్ చేసి గీత ఆర్ట్స్ వాళ్ళు కోటబొమ్మాళి సినిమా తీస్తున్నారు. అందులో చేస్తావా అని అడిగారు. డైరెక్టర్ ఎవరు అని అడిగితే తేజ అని అన్నారు. నేను తేజ గారి జోహార్ సినిమా చూసి ఆయనకి కాల్ చేసి సర్ మీరు చేసే సినిమాలో చేయడం చాలా లక్కు. ఎప్పుడైనా నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాను. తర్వాత ఈ సినిమా కోసం ఆయనని కలిశాను. ఈ సినిమా షూటింగ్ చాలా కష్టంగా ఉంటుంది కొండలు, కోనలు, చెప్పులు లేకుండా ఎక్కాల్సి ఉంటుంది. ఓకేనా అని అన్నారు.

అప్పుడు నేను యాక్టర్ గా కొత్త కొత్త క్యారెక్టర్స్ చేయాల్సి ఉంటుంది సార్ నాకు అవన్నీ కిక్ ఇస్తాయి కథ చెప్పండి సార్ అన్నాను. కథ విని ఓకే అన్నాను. రాహుల్ , శ్రీకాంత్ గారితో మొదటి నుండి షూటింగ్లో బాగా ఎంజాయ్ చేశాను. అరకులో షూటింగ్ చాలా బాగా అనిపించింది. ఈ సినిమాలో లింగిడి పాటలో నటించడం గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఈ సాంగ్ ఇక్కడే కాదు న్యూయార్క్ టైం స్క్వేర్ లో ప్లే అయినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ఈ వేడుకకు వచ్చిన అల్లు అరవింద్ గారికి, బోయపాటి గారికి, దిల్ రాజు గారికి అందరికీ నా ధన్యవాదాలు. ఈ సినిమాని అందరూ థియేటర్లో చూడండి. తప్పకుండా ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను అని శివాని చెప్పుకొచ్చారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది