Shruti haasan : ప్రేమలో పడ్డాను కాబట్టే ఇప్పుడు అది వదలలేకపోతున్నాను : శృతి హాసన్
Shruti haasan : విశ్వ నటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలో వచ్చింది శృతి హాసన్ Shruti haasan . ముందు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన శృతి Shruti haasan స్టార్ స్టేటస్ అందుకుంది మాత్రం తెలుగు, తమిళ సినిమాలతోనే. కెరీర్ ప్రారంభంలో శృతి హాసన్ స్టార్ స్టేటస్ దక్కించుకోవడానికి తండ్రి కమల్ హాసన్ ఇమేజ్ ఏమాత్రం ఉపయోగపడలేదు. కెరీర్ ప్రారంభంలో చేసిన సినిమాలు వరుసగా ఫ్లాపవుతూ వచ్చాయి. అయినా తను శ్రమిస్తుందనే కారణంగా మేకర్స్ అవకాశాలిచ్చారు. ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ కూడా ఈమెకి వస్తున్న వరుస ఫ్లాపులతో వచ్చేసింది.

shruti-haasan she fell in love with movies
అయితే తెలుగులో ఫస్ట్ హిట్ అందుకుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో. అప్పటి వరకు శృతి హాసన్‌కి ఫ్లాపులున్నా పవన్ కళ్యాణ్ నమ్మి అవకాశం ఇచ్చాడు. గబ్బర్ సింగ్ సినిమాకి హీరోయిన్ విషయంలో వ్యతిరేకత కూడా వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ డిసైడయితే ఎవరైనా డెసిషన్ మార్చుకోవాల్సిందే. అందుకే శృతి హాసన్ ని వద్దనుకున్న నిర్మాత బండ్ల గణేష్ కూడా తన డెసిషన్ మార్చుకొని గబ్బర్ సింగ్ సినిమాకి తీసుకున్నారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
Shruti haasan : మూడేళ్ళ గ్యాప్ తీసుకొని మళ్ళీ క్రాక్ సినిమాతో ఫాంలోకి వచ్చింది.
దాంతో తెలుగులో వరుసగా క్రేజీ ఆఫర్స్ తో పాటు హిట్స్ కూడా దక్కించుకుంది. ఎవడు, బలుపు, కాటమరాయుడు, శ్రీమంతుడు లాంటి సినిమాలతో హిట్స్ అందుకుంది. అయితే కాటమరాయుడు తర్వాత మూడేళ్ళ గ్యాప్ తీసుకొని మళ్ళీ క్రాక్ సినిమాతో ఫాంలోకి వచ్చింది. ప్రస్తుతం శృతి హాసన్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలో నటించిన లాభం రిలీజ్ కావాల్సి ఉంది. ఇక ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన వకీల్ సాబ్ తోనూ హిట్ అందుకుంది. అయితే శృతి హాసన్ ఓ సందర్భంలో సినిమాలు మానేయాలనుకుందట.

shruti-haasan she fell in love with movies
Shruti haasan : డబ్బు కోసమే సినిమాలు చేయాలనుకుందట.
శృతి హాసన్ Shruti haasan కి రాక్ బాండ్ అంటే చాలా ఇష్టం. ఆమె సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ప్రైవేట్ ఆల్బంస్ కూడా చేస్తుంటుంది. అయితే డబ్బు కోసమే సినిమాలు చేయాలనుకుందట. రెండు మూడు సినిమాలు చేశాక వచ్చిన డబ్బుతో తను అనుకున్న రాక్ బాండ్ నిర్వహించాలనుకుందట. కానీ ఇండస్ట్రీకొచ్చాక సినిమాలతో ప్రేమలో పడ్డానని అందుకే హీరోయిన్‌గా కంటిన్యూ అవుతున్నానని చెప్పుకొచ్చింది. ఏదేమైనా శృతి హాసన్ కి ఇప్పుడు సౌత్‌లో బాగా క్రేజ్ ఉంది. ఇక మొదటిసారి నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా సలార్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది శృతి హాసన్.

shruti-haasan she fell in love with movies