Taraka Ratna Wife : తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి గతం గురించి బిగ్ న్యూస్ , ఆమె మొదటి భర్త ఎవరో కాదు !
Taraka Ratna Wife : నందమూరి తారకరత్న శుక్రవారం నాడు నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రలో లోకేష్ కు మద్దతుగా పాల్గొన్నారు. అయితే పాదయాత్ర ప్రారంభమైన కొన్ని నిమిషాలకు తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురై స్పృహ తప్పి పడిపోయారు దీంతో వెంటనే సమీపంలోని కేసి ఆసుపత్రికి తరలించారు. అయితే తారకరత్నకు గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్థారించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేకమైన డాక్టర్ల చే తారకరత్నకు చికిత్స చేస్తున్నారని తెలుస్తుంది త్వరలోనే
తారకరత్న కోలుకొని ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఈ క్రమంలోనే నందమూరి తారక రత్న వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే తారకరత్న విజయసాయి రెడ్డి భార్య సునంద సొంత చెల్లెలి కుమార్తె అయిన అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈమె ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఇలా తారకరత్న నటించిన ఓ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేశారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. అయితే అలేఖ్య రెడ్డి ఇది మొదటి వివాహం కాదు.
ఆమెకు ఇంతకుముందే వివాహం అయింది. మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత తారకరత్నను పెళ్లి చేసుకున్నారు. అలేఖ్య తన మొదటి వివాహాన్నీ టిడిపి మాజీ మంత్రి ఎలిమి రెడ్డి మాధవరెడ్డి కొడుకు సందీప్ రెడ్డితో వివాహం అయింది. అయితే కొన్నాళ్లు సంతోషంగా ఉన్న ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తారకరత్నతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఇరు కుటుంబాలను ఒప్పించడానికి ప్రయత్నం చేసిన ఎవరు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ కలిసి సింపుల్గా సంఘీ టెంపుల్ లో వివాహం చేసుకున్నారు.